గత పదేళ్లకుపైగానే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్ష హోదాలోనే ఉంది. దేశంలో బీజేపీ పార్టీ అంతకంతకూ బలపడుతూ, వరుసగా ప్రధాని నరేంద్రమోదీ మూడోసారి ప్రధాని అయ్యారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ చాలా బలహీనంగా ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్లో పార్టీ తన ఉనికిని ఏమాత్రం చాటుకోలేకపోయింది. ఇతర పార్టీలతో కాంగ్రెస్ ‘జతకట్టి ‘ఇండియా’ కూటమిగా ఏర్పడినా, ఆశించిన విజయాన్ని పొందడం లేదు. ఎన్నికల్లో పార్టీల మధ్య విభేదాల వల్ల గెలవలేకపోతున్నది. ఈ పరిస్థితుల్లో తన భార్య ప్రియాంకాగాంధీ (priyanka gandhi) ఏదొక రోజు భారతదేశ ప్రధాని అవుతుందని భర్త రాబర్డ్ వాద్రా ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఇటీవల కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ మసూద్ ‘ప్రియాంకాగాంధీ తన నాయనమ్మ లాగానే బలమైన ప్రధానమంనరతి అని నిరూపించుకుంటారని’ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై రా బర్డ్ వాద్రాను మీడియా ప్రశ్నించగా.. భార్యకు మద్దతు ప్రకటించారు. ఇది కచ్చితమేనని.. ఏదొక రోజు ప్రియాంకాగాంధీ భారతదేశ ప్రధాని అవుతుంది.. ఇది అనివార్యం అని పేర్కొన్నారు.
Read also: TG Politics: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో KCR, హరీశ్‌కు నోటీసులు ఇవ్వనున్న సిట్?
Congress Party
నేనే కాదు చాలామంది కోరుకుంటున్నారు.. వాద్రా
చాలామంది ప్రియాంకాగాంధీని ప్రధానమంత్రిగా చూడాలని కోరుకుంటున్నారని. అది నేరవేరడం ఖాయమని విశ్వాసం వ్యక్తం చేశారు వాద్రా. రాజకీయాల్లో ఉజ్వల భవిష్యత్ ఉందని తాను భావిస్తున్నట్లు చెప్పారు. అవసరమైన మార్పులు కాలక్రమేణా జరుగుతాయని పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాబర్డ్ వాద్రా పేర్కొన్నా. ప్రియాంకాగాంధీ తన నాయనమ్మ, తండ్రి రాజీవ్, తల్లి సోనియాగాంధీ, రాహుల్ ఉంచి చాలా నేర్చుకున్నారని చెప్పారు. ఆమె ఏం మాట్లాడినా ప్రజలకు సంబంధించిన అంశాలపైనే మాట్లాడుతుందని పేర్కొన్నారు. ఒకవిధంగా చెప్పాలంటే రాహుల్ గాంధీ కంటే ప్రియాంకాగాంధీకే ప్రజా ఆకర్షణ అధికంగా ఉంది. ఆమె ప్రజల్లోకి రావాలని, కాంగ్రెస్ పార్టీ నాయకత్వ పగ్గాలు చేపట్టాలనే డిమాండ్ ఎప్పటినుంచో ఉంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: