📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్

కాంగ్రెస్ పార్టీవీ చీప్ పాలిటిక్స్ – బీజేపీ

Author Icon By Sudheer
Updated: December 29, 2024 • 9:55 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కాంగ్రెస్ పార్టీ చీప్ పాలిటిక్స్ చేస్తుందని బీజేపీ మండిపడింది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ స్మారకార్థం స్థలాన్ని కేటాయించలేదంటూ కాంగ్రెస్ చేసిన తీరు సిగ్గుచేటుగా అభివర్ణించింది. బీజేపీ నాయకులు, కేంద్ర మంత్రులు ఈ విషయంపై తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్ రాజకీయ లబ్ధి కోసం ఇలాంటి ఆరోపణలు చేస్తుందని బీజేపీ ఆరోపించింది. మన్మోహన్ సింగ్ అంత్యక్రియల్లో ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా వంటి ప్రముఖులను మాత్రమే మీడియా కవరేజ్ చేసింది అనే ఆరోపణలను బీజేపీ ఖండించింది. భద్రతా కారణాల రీత్యా మీడియా కవరేజ్‌ పై నియంత్రణలు ఉన్నాయని స్పష్టంచేసింది. అంత్యక్రియల నిర్వహణలో ఎలాంటి రాజకీయం జరగలేదని బీజేపీ వెల్లడించింది.

అంత్యక్రియల ప్రాంగణంలో సరిపడా కుర్చీలు ఏర్పాటు చేయలేదన్న కాంగ్రెస్ ఆరోపణలను సైతం బీజేపీ ఖండించింది. ప్రోటోకాల్ ప్రకారం, మాజీ ప్రధానమంత్రి కుటుంబానికి ప్రథమ వరుసలో ఐదు కుర్చీలు కేటాయించినట్లు పేర్కొంది. కాంగ్రెస్ ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని, ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే ఇలాంటి మాటలు చెబుతున్నారని బీజేపీ స్పష్టం చేసింది. బీజేపీ దృష్టిలో కాంగ్రెస్ పార్టీ ఈ అంశాన్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకోవాలని చూస్తోందని వ్యాఖ్యానించింది. మన్మోహన్ సింగ్ లాంటి మహానుభావుడి పేరును కూడా కాంగ్రెస్ రాజకీయ ప్రకటనల కోసం వాడుకోవడం సిగ్గుచేటని , ఇది కాంగ్రెస్ దుస్థితికి నిదర్శనమని మండిపడ్డారు.

BJP congress Manmohan Singh

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.