📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ప్రజలకు కూటమి సర్కార్ గుడ్‌న్యూస్.. కరెంట్ ఛార్జీల తగ్గింపు ఇంటర్ పరీక్షల్లో కొత్త మార్పులు వారికి ఫ్రీగా సోలార్ రూఫ్ టాప్: మంత్రి గొట్టిపాటి సమ్మక్క–సారలమ్మ మహాజాతర 2026 షెడ్యూల్ విడుదల మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ పెరుగుతున్న క్వయెట్ పైరింగ్.. ఉద్యోగుల్లో పెరుగుతున్న టెన్షన్ వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్ ట్రంప్ హెచ్చరికలతో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ నష్టాల బాటలో దేశీయ స్టాక్ మార్కెట్లు సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు ఈరోజు నుంచి మలేషియా ఓపెన్ టోర్నమెంట్ హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య ప్రజలకు కూటమి సర్కార్ గుడ్‌న్యూస్.. కరెంట్ ఛార్జీల తగ్గింపు ఇంటర్ పరీక్షల్లో కొత్త మార్పులు వారికి ఫ్రీగా సోలార్ రూఫ్ టాప్: మంత్రి గొట్టిపాటి సమ్మక్క–సారలమ్మ మహాజాతర 2026 షెడ్యూల్ విడుదల మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ పెరుగుతున్న క్వయెట్ పైరింగ్.. ఉద్యోగుల్లో పెరుగుతున్న టెన్షన్ వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్ ట్రంప్ హెచ్చరికలతో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ నష్టాల బాటలో దేశీయ స్టాక్ మార్కెట్లు సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు ఈరోజు నుంచి మలేషియా ఓపెన్ టోర్నమెంట్ హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య

Conflicts: బంగ్లాదేశ్‌లో కొనసాగుతున్న ఉద్రిక్తత.. మరో వ్యక్తి మృతి

Author Icon By Saritha
Updated: January 3, 2026 • 3:59 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బంగ్లాదేశ్‌లో (Bangladesh) హిందూ మైనారిటీలే లక్ష్యంగా జరుగుతున్న దాడులు మరోసారి కలకలం రేపుతున్నాయి. షరియత్‌పూర్ జిల్లాలో (Conflicts) ఖోకన్ చంద్ర దాస్ (50) అనే హిందూ వ్యాపారిపై దుండగులు అమానవీయంగా దాడి చేసి, సజీవ దహనం చేసేందుకు ప్రయత్నించారు. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరిన ఆయన, చికిత్స పొందుతూ శనివారం ప్రాణాలు విడిచారు. మెడికల్ షాపు, మొబైల్ బ్యాంకింగ్ నిర్వహించే ఖోకన్ దాస్, డిసెంబర్ 31 రాత్రి తన పని ముగించుకుని ఆటో రిక్షాలో ఇంటికి బయలుదేరారు. మార్గమధ్యంలో తిలోయి ప్రాంతానికి చేరుకోగానే, కొందరు దుండగులు ఆటోను అడ్డుకున్నారు. ఖోకన్‌ను బయటకు లాగి కత్తులతో విచక్షణారహితంగా పొడిచారు. అంతటితో ఆగకుండా, చనిపోయాడని నిర్ధారించుకోవడానికి ఆయన శరీరంపై పెట్రోల్ పోసి నిప్పంటించారు.

Read also: Super Moon 2026: నేడు పౌర్ణమి.. పెద్దగా కనిపించనున్న చంద్రుడు

ప్రాణాలు కాపాడుకోవడానికి చెరువులోకి దూకిన బాధితుడు

మంటల సెగతో విలవిలలాడిన ఖోకన్, ప్రాణాలను కాపాడుకోవడానికి పక్కనే ఉన్న చెరువులోకి దూకారు. ఆయన అరుపులు విన్న స్థానికులు అక్కడికి చేరుకోగా దుండగులు పరారయ్యారు. వెంటనే ఆయనను షరియత్‌పూర్ సదర్ ఆసుపత్రికి, ఆపై పరిస్థితి విషమించడంతో ఢాకాలోని మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. (Conflicts) ఖోకన్ శరీరంపై తీవ్రమైన కత్తిపోట్లతో పాటు ముఖం, తల చేతులు తీవ్రంగా కాలిపోయాయని వైద్యులు తెలిపారు. రెండు రోజుల పాటు మృత్యువుతో పోరాడిన ఆయన గాయాల తీవ్రత తట్టుకోలేక జనవరి 2న తుదిశ్వాస విడిచారు. తనపై దాడి చేసిన వారిలో రబ్బీ, సోహగ్ అనే వ్యక్తులను ఖోకన్ గుర్తించినట్లు ఆయన భార్య సీమా దాస్ పేర్కొన్నారు. గత రెండు వారాల్లో బంగ్లాదేశ్‌లో హిందువులపై జరిగిన నాలుగో దాడి ఇది. ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని మైనారిటీలకు రక్షణ కల్పించాలని మానవ హక్కుల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:


bangladesh Communal violence Hindu Minority Attack Human Rights Khokan Chandra Das Latest News in Telugu Minority Rights Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.