జాతీయ స్థాయిలో వివాదాస్పదంగా మారిన వీధి కుక్కల అంశంపై సుప్రీంకోర్టు(Supreme Court) కీలక వ్యాఖ్యలు చేసింది. ఇకపై కుక్కల దాడిలో గాయపడిన లేదా మరణించిన వారి కుటుంబాలకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే భారీ పరిహారం చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. వీధి కుక్కల నియంత్రణలో నిర్లక్ష్యం వహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వాలకు హెచ్చరికలు జారీ చేసింది. జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ఎన్వీ అంజారియాతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించింది. గత ఐదేళ్లుగా వీధి కుక్కల నియంత్రణకు సంబంధించి ఉన్న నిబంధనలను రాష్ట్రాలు సరిగా అమలు చేయకపోవడం వల్లే ఈ దుస్థితి తలెత్తినట్లు అభిప్రాయపడింది. అదే విధంగా వీధి కుక్కలకు ఆహారం పెడుతున్న వారిపైనా కోర్టు అసహనం వ్యక్తం చేసింది. వీధి శునకాలపై ప్రేమ ఉంటే వాటిని ఇంటికి తీసుకెళ్లి పెంచుకోమని సూచించింది. రోజురోజుకు పెరుగుతున్న వీధి కుక్కల సమస్య భావోద్వేగభరిత అంశమని తెలిపింది. కుక్కలు వీధుల్లో తిరుగుతూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తే సహించబోమని స్పష్టం చేసింది.
Read Also: Trump: రేపు సుంకాల చట్టబద్ధతపై అమెరికా సుప్రీంకోర్టు కీలక తీర్పు
సమస్య వెయ్యి రెట్లు పెరిగింది
గుజరాత్‌కు చెందిన ఒక న్యాయవాదిని పార్కులో కుక్క కరిచిందని, దాన్ని పట్టుకోవడానికి అధికారులు వెళ్లినప్పుడు జంతు ప్రేమికులు వారిపై దాడి చేశారని న్యాయస్థానం పేర్కొంది. నాలుగు రోజులుగా ఈ విషయంపై వాదనలు వింటున్నామని పేర్కొంది. అయితే, కార్యకర్తలు, ఎన్జీఓలు తమను ముందుకు సాగనివ్వడం లేదని, దీంతో కేంద్ర, రాష్ట్రాల అభిప్రాయాలను వినలేకపోతున్నామని న్యాయస్థానం విచారం వ్యక్తం చేసింది. “న్యాయవాదులందరికీ మా అభ్యర్థన ఏమిటంటే, కేంద్ర, రాష్ట్ర అధికారులపై ఉత్తర్వులు జారీ చేయనివ్వండి. ఈ సమస్య గురించి చర్చించడానికి రాష్ట్రాలు, కేంద్రంతో మేము చర్చించాలి. ఎందుకంటే సమస్య వెయ్యి రెట్లు పెరిగింది. కాబట్టి తదుపరి కార్యచరణ కోసం ముందుకు సాగనివ్వండి” అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.
కుక్కల దాడుల వల్ల రేబిస్ మరణాల సంఖ్య పెరుగుతున్నది
అంతకుముందు, వీధిలో ఉన్న ప్రతి కుక్కను తరలించాలని తాము చెప్పలేదని గతంలో ఇచ్చిన ఆదేశాలపై అత్యున్నత న్యాయస్థానం స్పందించింది. కేవలం సంస్థలు, కార్యాలయాల నుంచి మాత్రమే వాటిని తరలించమన్నామని పేర్కొంది. అదేవిధంగా జంతువుల జనన నియంత్రణకు సంబంధించిన నిబంధనలపై ప్రధానంగా దృష్టి పెట్టాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. వీధి కుక్కల దాడుల వల్ల రేబిస్ మరణాల సంఖ్య క్రమంగా పెరగుతోందని, వాటికి స్టెరిలైజేషన్ చేయాలని కోర్టు గతేడాది నవంబర్‌లో ఆదేశాలు జారీ చేసింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: