📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం

కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరలు తగ్గింపు

Author Icon By sumalatha chinthakayala
Updated: January 1, 2025 • 10:56 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటున్నారు. న్యూ ఇయర్ కానుకగా ఊరట కలిగించే శుభవార్త వచ్చింది. చమురు మార్కెటింగ్ సంస్థలు జనవరి 1, 2025న కమర్షియల్ LPG సిలిండర్ల ధరను తగ్గించాయి. ఢిల్లీలో నేడు 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధర రూ. 1,804కి పడిపోయింది. గతంలో రూ. 1,818.5 ఉన్న సిలిండర్ ధర రూ. 14.5 తగ్గింది. దాంతో పాటు జెట్ ఇంధనం లేక ATF ధరలు సైతం నూతన సంవత్సరం రోజు బుధవారం 1.54 శాతం దిగి రావడం విశేషం. కానీ ఇంటి అవసరాల కోసం వినియోగించే సిలిండర్ల ధరలు యథాతథంగా ఉన్నాయి. నేడు 14.2 కిలోల డొమెస్టిక్ ఎల్‌పిజి సిలిండర్ల ధర (LPG Cylinder Price)లో ఎలాంటి మార్పు లేదు.

ఐదు నెలలపాటు వరుసగా పెరిగిన కమర్షియల్ సిలిండర్ ధర నూతన సంవత్సరం సందర్భంగా దిగొచ్చింది. గత నెలలు ప్రతినెల ఒకటో తేదీన కమర్షియల్ ఎల్పీజీ ధరల్ని చమురు కంపెనీలు పెంచుతూ వచ్చాయి. చివరగా డిసెంబర్ 1న 19 కిలోల కమర్షియల్ సిలిండర్‌పై రూ.16.5 పెంచారు. గత ఐదు సవరణలలో వాణిజ్య సిలిండర్ ధర రూ. 172.5 మేర పెరిగింది. గృహావసరాలలో ఉపయోగించే వంట గ్యాస్ సిలిండర్ ధర 14.2 కిలోల సిలిండర్‌పై రూ.803 వద్ద కొనసాగుతోంది. వీటి ధర యథాతథంగా ఉంది.

జనవరి 1, 2025న సవరించిన ధరల తర్వాత, ఢిల్లీలో 19 కిలోల సిలిండర్‌ ధర రూ. 1,804కు దిగొచ్చింది. ముంబయిలో 19 కిలోల కమర్షియల్ సిలిండర్‌ ధర రూ. 1,756. కోల్‌కతాలో 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధర రూ. 1,911 . చెన్నైలో 19 కేజీల కమర్షియల్ సిలిండర్ రూ. 1,966. హైదరాబాద్ గృహ అవసరాలకు వినియోగించే 14.2 కేజీల డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ ధర రూ. 855గా ఉంది. 19 కేజీల కమర్షియల్ సిలిండర్ రూ.2030కి దిగొచ్చింది.

Commercial LPG cylinder delhi hyderabad Mumbai prices reduced

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.