📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Latest News: CM Revanth Reddy – నేడు సీఎం రేవంత్‌రెడ్డితో సమావేశం కానున్న NHAI అధికారులు..

Author Icon By Anusha
Updated: September 22, 2025 • 11:48 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణలో జాతీయ రహదారుల నిర్మాణ పనుల ముందున్న సవాళ్లను పరిష్కరించడానికి కీలకమైన సమావేశం సోమవారం (నేడు) జరుగనుంది. ఈ సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ (MoRTH), భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) అధికారులు పాల్గొననున్నారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari) సూచనల మేరకు, ఢిల్లీ నుండి ప్రత్యేక బృందం ఈ సమావేశంలో పాల్గొనడం విశేషం.

సమావేశంలో ప్రధానంగా జాతీయ రహదారుల నిర్మాణానికి అవాంతరాలు కలిగిస్తున్న అంశాలను చర్చించనున్నారు. ఇందులో భూసేకరణ సమస్యలు, అటవీ అనుమతులు, యుటిలిటీ ఛార్జీలు, స్థానిక ప్రాంతీయ భవనాలు, విద్యుత్, నీటి సరఫరా వంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ (Infrastructure) సమస్యలు ప్రధానంగా చర్చకు వస్తాయి. ఈ అంశాలపై సమగ్రమైన పరిష్కారం కనుగొనడం లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర అధికారులు సమన్వయంగా పనిచేస్తున్నారు.

భవిష్యత్తు ప్రాజెక్టులపై కూడా చర్చించే అవకాశం

సమస్యల పరిష్కారం కోసం, గత మూడు రోజులుగా రాష్ట్ర రోడ్లు-భవనాలు, అటవీ, విద్యుత్ శాఖల అధికారులు సన్నాహక సమావేశాలు నిర్వహించారు. అదే విధంగా కేంద్ర అధికారులు కూడా ఈ నెల 17న అంతర్గత సమావేశం ఏర్పాటు చేసి, రాష్ట్రంలో ఉన్న జాతీయ రహదారుల ప్రాజెక్టు (National Highways Projects) లపై పూర్తిస్థాయి నివేదికను సిద్ధం చేశారు.ఈ సమావేశంలో హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు,

ఫ్యూచర్ సిటీ నుంచి ఏపీ రాజధాని అమరావతి వరకు నిర్మించనున్న గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే (Greenfield Expressway) వంటి భవిష్యత్తు ప్రాజెక్టులపై కూడా చర్చించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఇటీవల హైదరాబాద్-అమరావతి ఎక్స్‌ప్రెస్ వేపై సీఎం రేవంత్ గడ్కరీని కలిశారు. విభజన హామీల్లో భాగంగా రెండు రాష్ట్రాల మధ్య 12 వరుసల హైవే నిర్మించాలని సీఎం కోరగా.. గడ్కరీ సానుకూలంగా స్పందించారు.

CM Revanth Reddy

రహదారులపై కూడా సమావేశంలో చర్చ

నాగ్‌పూర్-విజయవాడ కారిడార్ (NH-163G): ఈ కారిడార్‌లోని మంచిర్యాల- వరంగల్- ఖమ్మం- విజయవాడ సెక్షన్‌లో భూసేకరణలో ఇబ్బందులున్నాయి.ఆర్మూర్- జగిత్యాల- మంచిర్యాల రోడ్డు (NH-63): ఈ రహదారి భూసేకరణలో కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయి.హైదరాబాద్- మన్నెగూడ సెక్షన్ (NH-163): ఈ రోడ్డులో పెద్ద సంఖ్యలో ఉన్న మర్రి చెట్ల కారణంగా కోర్టు కేసుల వల్ల పనులు నిలిచిపోయాయి.

జగిత్యాల-కరీంనగర్ (NH-563), హైదరాబాద్- శ్రీశైలం (NH-765) రహదారులతో పాటు, కృష్ణా నదిపై ఐకానిక్ వంతెన (NH-167K), హైదరాబాద్-రాయ్‌పూర్ రోడ్డు, బెల్లంపల్లి-గడ్చిరోలి-దుర్గ్ గ్రీన్‌ఫీల్డ్ రహదారులపై కూడా సమావేశంలో చర్చ జరగనుంది.మంచిర్యాల, కామారెడ్డి, మెదక్, మేడ్చల్, నిజామాబాద్, భూపాలపల్లి,

ఈ సమావేశంలో వీటికి ఒక స్పష్టమైన పరిష్కారం

మహబూబాబాద్, నాగర్‌కర్నూల్, కొత్తగూడెం, మహబూబ్‌నగర్ జిల్లాల్లో రహదారుల విస్తరణలో అటవీ సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ సమావేశంలో వీటికి ఒక స్పష్టమైన పరిష్కారం లభించే అవకాశం ఉంది. ఈ సమావేశం ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం కుదిరి, పెండింగ్‌లో ఉన్న జాతీయ రహదారుల ప్రాజెక్టులు వేగంగా పూర్తయ్యే అవకాశం ఉందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/hydraa-hydra-acquired-317-lands-in-gajularamaram/hyderabad/551702/

Breaking News Chief Minister Revanth Reddy latest news MoRTH meeting NHAI projects road construction challenges Telangana highways issues Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.