నేడు ప్రధానితో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ

Read Time:  1 min
CM Revanth Reddy meet the Prime Minister today
CM Revanth Reddy meet the Prime Minister today
FONT SIZE
GET APP

మోడీ అపాయింట్‌మెంట్‌ కోరిన రేవంత్‌రెడ్డి

హైదరాబాద్‌: సీఎం రేవంత్‌రెడ్డి బుధవారం ఉదయం 10.30కు ప్రధాని మోడీని కలవనున్నారు. ప్రధానమంత్రి కార్యాలయం నుంచి అపాయింట్‌మెంట్‌ సమాచారం రావడంతో ఆయన మంగళవారం రాత్రి ఢిల్లీ చేరుకున్నారు. గత ఏడాది జులైలో ప్రధానితో భేటీ అయిన రేవంత్‌రెడ్డి దాదాపు 6 నెలల తర్వాత మళ్లీ సమావేశం కానున్నారు. ఇటీవల ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదంపై మోడీ ఆయనతో ఫోన్‌లో మాట్లాడారు.

నేడు ప్రధానితో సీఎం రేవంత్‌రెడ్డి

పెండింగ్‌ సమస్యలను ప్రధానికి విన్నపం

ఈరోజు భేటీలో ఈ ఘటనను పూర్తిస్థాయిలో వివరించడంతోపాటు,పలు ప్రాజెక్టులపై కేంద్ర సాయం కోరనున్నట్లు తెలిసింది. మూసీ సుందరీకరణ, శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు వరకు మెట్రోరైలు ప్రాజెక్టు, రీజినల్‌ రింగ్‌ రోడ్డు నిర్మాణాన్ని వేగంగా ముందుకు తీసుకెళ్లడంతోపాటు విభజన చట్టంలోని వివిధ పెండింగ్‌ సమస్యలను ప్రధానికి విన్నవించనున్నట్లు సమాచారం. పలువురు కేంద్ర మంత్రులను సైతం కలిసే అవకాశం ఉంది.

ఎమ్మెల్సీ టికెట్లపై ఏఐసీసీ పెద్దలతోనూ చర్చలు

ఇక, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్లు విడుదలైన నేపథ్యంలో పార్టీ అధిష్ఠానం పెద్దలనూ కలిసి చర్చించేందుకు ఆస్కారం ఉన్నట్లు చెబుతున్నారు. రెండో విడత కులగణన సర్వే ఈ నెల 28తో పూర్తి కానున్న నేపథ్యంలో తాజా వివరాలనూ క్రోడీకరించి నివేదికను అసెంబ్లీకి ప్రభుత్వం సమర్పించనుంది. ఈ సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపైనా నిపుణులతో చర్చించే అవకాశం ఉందంటున్నారు. సీఎం బుధవారం సాయంత్రం హైదరాబాద్‌కు తిరిగి రానున్నారు.

sumalatha chinthakayala

రచయిత గురించి

sumalatha chinthakayala

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.