CM Revanth at AI Summit: కొత్త ఆవిష్కరణలు మానవ జీవన విధానంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్నాయని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఢిల్లీ వేదికగా జరుగుతున్న “ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026″లో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) అనేది కేవలం ఒక సాంకేతికత మాత్రమే కాదని, అది అన్ని రంగాలను ప్రభావితం చేసే శక్తివంతమైన సాధనమని ఆయన ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు.
Read Also: Nalgonda Crime: మద్యం మత్తులో తండ్రిని పొట్టనబెట్టుకున్న కొడుకు
నేషనల్ ఏఐ కౌన్సిల్ ఏర్పాటు చేయాలి: రేవంత్ కీలక ప్రతిపాదన
దేశంలో ఏఐ వినియోగాన్ని క్రమబద్ధీకరించడానికి, రాష్ట్రాల మధ్య సమన్వయం కోసం ఒక ప్రత్యేక వేదిక ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. “జీఎస్టీ కౌన్సిల్ తరహాలోనే ‘నేషనల్ ఏఐ కౌన్సిల్’ ఏర్పాటు చేస్తే బాగుంటుంది. ఇది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వారధిలా పనిచేసి, సాంకేతిక ఫలాలను సామాన్యులకు చేరవేస్తుంది” అని ఆయన ప్రతిపాదించారు. ఈ ఆలోచన సదస్సులో పాల్గొన్న ప్రతినిధుల దృష్టిని ఆకర్షించింది.వ్యవసాయరంగానికి ఏఐ టెక్నాలజీ ఎంతో దోహదపడుతుంది. ఏఐ టెక్నాలజీ అన్ని రంగాలపై ప్రభావం చూపిస్తోంది. తెలంగాణలో ఏఐ స్టార్టప్స్ మంచి ప్రోగ్రెస్ చూపిస్తున్నాయి.
ఏఐ దుర్వినియోగం కాకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరారు. హైదరాబాద్‌కు వచ్చి పెట్టుబడులు పెట్టాలని ముఖ్యమంత్రి టెక్ సంస్థలను కోరారు. ఏఐ రంగంలో ఎన్నో అవకాశాలు ఉన్నాయని, వాటిని అందిపుచ్చుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. ఏఐలో స్టార్టప్‌లను ప్రోత్సహించాలని అన్నారు. ఏఐ మానవ జీవితాల్లో పెను మార్పులు తీసుకువస్తోందని ముఖ్యమంత్రి తెలిపారు.
మనిషికి ఎన్నో పరిమితులు ఉండవచ్చని, అదే మనిషి సృష్టించిన ఏఐ ఫలితాలను మనం చూస్తూనే ఉన్నామని అన్నారు. గతంలో పారిశ్రామిక విప్లవం వచ్చిందని, ఇప్పుడు సాఫ్ట్‌వేర్ విప్లవం, ఏఐ శకం వచ్చిందని పేర్కొన్నారు. ప్రముఖ అంతర్జాతీయ కంపెనీలకు భారతీయులే సీఈవోలుగా ఉన్నారని గుర్తు చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: