📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Omar Abdullah Meets PM Modi : ప్రధాని మోదీతో సీఎం ఒమర్ అబ్దుల్లా భేటీ

Author Icon By Sudheer
Updated: May 4, 2025 • 6:17 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా దేశ ప్రధాని నరేంద్ర మోదీతో ఢిల్లీలో భేటీ అయ్యారు. ఇటీవల పహల్గాం లోయలో జరిగిన ఉగ్రవాద దాడిలో 26 మంది పర్యాటకులు మృతి చెందిన ఘటనను నేపథ్యంగా చేసుకుని, భద్రతాపరమైన పరిస్థితులపై ఈ సమావేశంలో చర్చించారని అధికార వర్గాలు వెల్లడించాయి. ఇది దాడి అనంతరం ప్రధాని మోదీతో ఒమర్ అబ్దుల్లా కలుసుకున్న తొలి సారి కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. భేటీ సుమారు 30 నిమిషాల పాటు కొనసాగిందని సమాచారం.

పర్యాటకుల భద్రతపై ప్రధానంగా చర్చ

పహల్గాం దాడిలో మరణించిన పర్యాటకుల ఘటన తర్వాత రాష్ట్రంలో నెలకొన్న భయాందోళన పరిస్థితులు, భద్రతా ఏర్పాట్లు, ఉగ్రవాదులపై చేపట్టిన చర్యలపై ఒమర్ అబ్దుల్లా ప్రధానికి వివరించారు. గుర్రాలపై పర్యాటకులను తీసుకెళ్తున్న పోనీవాలా సయ్యద్ అదిల్ హుస్సేన్ షా తాను ప్రాణాలు కోల్పోయి పర్యాటకులను రక్షించేందుకు చేసిన ప్రయత్నాన్ని సీఎం మోదీ దృష్టికి తీసుకెళ్లారు. ఉగ్రదాడిని వ్యతిరేకిస్తూ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ప్రజలు నిరసనలు తెలుపుతున్నారని కూడా ప్రధానికి చెప్పారు.

ఉగ్రవాదులపై కఠిన చర్యలు, పాక్‌కు హెచ్చరిక

పహల్గాం దాడి తర్వాత భద్రతా బలగాలు ఉగ్రవాదుల వేటను ముమ్మరం చేశాయి. దాడికి పాల్పడిన ఉగ్రవాదులు ఏప్రిల్ 15 నుంచే పహల్గాంలో సంచరించినట్లు విచారణలో వెల్లడైంది. బైసరన్ లోయ ప్రాంతం వ్యూహాత్మకంగా అనుకూలంగా ఉండటంతో అక్కడే దాడి నిర్వహించినట్లు నిర్ధారణ అయింది. ఉగ్రవాదులకు కొంతమంది స్థానికులు సహకరించినట్లు ఎన్ఐఏ గుర్తించింది. ఈ దాడికి పాక్‌ మద్దతు ఉందని గుర్తించిన భారత్‌, ఆ దేశంపై ఆర్థికంగా కఠిన చర్యలు తీసుకుంది. పాక్‌కు ఎగుమతులు, దిగుమతులు నిలిపివేస్తూ భారత్‌ స్పష్టమైన హెచ్చరిక ఇచ్చింది.

Read Also : Rahul Gandhi : రాహుల్ గాంధీపై బీజేపీ నేత సంచలన కామెంట్స్!

Google News in Telugu J&K CM Omar Abdullah Pahalgam Terror Attack PM Modi

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.