📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు ప్రజలకు కూటమి సర్కార్ గుడ్‌న్యూస్.. కరెంట్ ఛార్జీల తగ్గింపు ఇంటర్ పరీక్షల్లో కొత్త మార్పులు వారికి ఫ్రీగా సోలార్ రూఫ్ టాప్: మంత్రి గొట్టిపాటి విజయవాడలో సైబర్ క్రైమ్ ముఠా అరెస్ట్ రాష్ట్ర పండుగగా వడ్డే ఓబన్న జయంతి నేటి నుంచి స్కూళ్లలో ఆధార్ క్యాంపులు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు ప్రజలకు కూటమి సర్కార్ గుడ్‌న్యూస్.. కరెంట్ ఛార్జీల తగ్గింపు ఇంటర్ పరీక్షల్లో కొత్త మార్పులు వారికి ఫ్రీగా సోలార్ రూఫ్ టాప్: మంత్రి గొట్టిపాటి విజయవాడలో సైబర్ క్రైమ్ ముఠా అరెస్ట్ రాష్ట్ర పండుగగా వడ్డే ఓబన్న జయంతి నేటి నుంచి స్కూళ్లలో ఆధార్ క్యాంపులు

Latest News: CM Chandrababu: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయేదే విజయం

Author Icon By Aanusha
Updated: October 16, 2025 • 10:05 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కర్నూలు జిల్లా నన్నూరు గ్రామంలో గురువారం ఒక బహిరంగ సభను నిర్వహించారు, అందులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu) ప్రసంగించారు. ఈ సభ ప్రత్యేకత ఏమిటంటే, చంద్రబాబు హిందీ భాషలో ప్రసంగించారు., ఇది స్థానిక ప్రజలకు కూడా ఒక అరుదైన దృశ్యంగా అనిపించిందని తెలుస్తోంది.

Read Also: Chandrababu: రాయలసీమకు హైకోర్టు బెంచ్.. 

ముఖ్యమంత్రి (CM Chandrababu) హిందీ మాట్లాడటం ప్రజల్లో విశేషమైన ఆకర్షణ సృష్టించింది. ఆయన ప్రసంగంలో రాజకీయ విశ్లేషణలు, ఎన్నికల ఊహాగానాలు, కేంద్ర ప్రభుత్వ విజయాలపై స్పష్టమైన ధృఢత్వం కనిపించింది.

సభలో చంద్రబాబు హిందీగా మాట్లాడినప్పుడు ప్రజలు ఆశ్చర్యపోయారు. సాధారణంగా తెలుగు ప్రాంతాల్లో నాయకులు తెలుగు లోనే ప్రసంగిస్తారు. అయితే చంద్రబాబు హిందీ లో మాట్లాడటం ద్వారా బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్డీయే కూటమికి మద్దతు పెంపొందించడమే ఆయన ఉద్దేశం.

దేశ ప్రగతిని కొనసాగించేందుకు

“బీహార్‌లో ఎన్డీయే కచ్చితంగా విజయం సాధిస్తుంది” అని ఆయన స్పష్టం చేశారు. అలాగే, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) విజయయాత్ర భారత దేశం విజయమని ఆయన చెప్పారు.దేశ ప్రగతిని కొనసాగించేందుకు, ‘వికసిత్ భారత్’ కలను సాకారం చేసేందుకు ప్రధాని మోదీకి శక్తినివ్వాలని శ్రీశైలం బ్రమరాంబ మల్లికార్జున స్వామిని ప్రార్థిస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు.

కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్డీయే (NDA) డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఉండటంతో ఆంధ్రప్రదేశ్‌కు రెట్టింపు ప్రయోజనాలు కలుగుతున్నాయని ముఖ్యమంత్రి అన్నారు. ప్రధాని మోదీ మద్దతుతో రాష్ట్రానికి అత్యధికంగా పెట్టుబడులు వస్తున్నాయని చెప్పారు.గత 16 నెలలుగా రాష్ట్రానికి ప్రధాని అందిస్తున్న సహాయాన్ని మర్చిపోలేమని,

CM Chandrababu

విశాఖ ఉక్కు పరిశ్రమను బలోపే

కేంద్రం సహకారంతోనే అమరావతి పనులు మళ్లీ ప్రారంభమయ్యాయని, పోలవరం ప్రాజెక్టు గాడిన పడిందని, విశాఖ ఉక్కు పరిశ్రమను బలోపేతం చేశామని గుర్తుచేశారు. జీఎస్టీ 2.0 సంస్కరణల వల్ల 99 శాతం వస్తువులు 0 నుంచి 5 శాతం పన్ను పరిధిలోకి వచ్చి పేద, మధ్యతరగతి ప్రజలకు ఎంతో మేలు జరిగిందని, ప్రతి కుటుంబానికి ఏటా రూ. 15,000 వరకు ఆదా అవుతుందని వివరించారు.

ప్రధాని మోదీ ‘స్వదేశీ’ పిలుపుతో దేశంలో సెమీకండక్టర్ల నుంచి శాటిలైట్ల వరకు, చిప్స్ నుంచి షిప్‌ల వరకు అన్నీ దేశీయంగానే తయారవుతున్నాయని ఆయన ప్రశంసించారు.చంద్రబాబు హిందీ ప్రసంగంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు.

“చంద్రబాబు గారు ఇంత చక్కగా హిందీలో మాట్లాడి బీహార్‌లోని ఎన్డీయే కార్యకర్తల హృదయాలను గెలుచుకున్నారు. ‘ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్’ పట్ల తన నిబద్ధతను చాటుకున్నారు” అని ప్రధాని కొనియాడారు. ఈ మేరకు చంద్రబాబు హిందీ ప్రసంగం వీడియోను కూడా ఆయన పంచుకున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

Breaking News Chandrababu Naidu Hindi speech latest news Narendra Modi NDA Bihar elections Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.