దేశంలో పెరుగుతున్న కాలుష్యాన్ని నియంత్రించాలంటే సమాజంలోని ధనవంతులు కూడా త్యాగాలకు సిద్ధంగా ఉండాలని భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ సూర్యకాంత్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం కార్లు అవసరానికి మించి స్టేటస్ సింబల్‌గా మారాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
Read Also: TG Weather: జాగ్రత్త.. మరింత వణికించనున్న చలి

సైకిళ్ల వినియోగాన్ని వదిలేసి, కార్లు కొనుగోలు చేయడానికే ప్రజలు డబ్బు ఆదా చేస్తున్న పరిస్థితి నెలకొందని CJI వ్యాఖ్యానించారు. ముఖ్యంగా ధనవంతులు ఒకటికంటే ఎక్కువ కార్లు కొనడం మానేస్తే కాలుష్య స్థాయులు గణనీయంగా తగ్గే అవకాశం ఉందని సూచించారు. అలాగే అధిక ఇంధనం వినియోగించే హైఎండ్ కార్లకు బదులు ఎలక్ట్రిక్ వాహనాలు (EVs) వినియోగంలోకి తీసుకురావాలని సూచించారు.
ఢిల్లీ కాలుష్య నియంత్రణ వ్యవస్థపై కూడా CJI తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గాలి నాణ్యత పర్యవేక్షణ కమిషన్ (AQMC) తన బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించడంలో విఫలమవుతోందని విమర్శించారు. టోల్ ప్లాజాల మూసివేతకు రెండు నెలల గడువు కావాలని అధికారులు కోరడాన్ని ఆయన తప్పుబట్టారు. కాలుష్య నియంత్రణ విషయంలో ఆలస్యం తగదని, తక్షణమే చర్యలు అవసరమని స్పష్టం చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: