కేంద్ర ప్రభుత్వానికి చెందిన సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ సర్ట్-ఇన్ (CERT-In) గూగుల్ క్రోమ్(Chrome) బ్రౌజర్ పాత వెర్షన్ ఉపయోగిస్తున్న యూజర్లకు తాజా హెచ్చరికను జారీ చేసింది. పాత వెర్షన్లలో తీవ్రమైన భద్రతా లోపాలు (Severe Security Vulnerabilities) ఉన్నాయని వెల్లడించింది. ఈ లోపాల కారణంగా హ్యాకర్లు సిస్టమ్‌లోకి చొరబడి, వ్యక్తిగత సమాచారం, పాస్‌వర్డ్లు, బ్యాంక్ వివరాలు లీక్ చేసే ప్రమాదం ఉందని తెలిపింది. ముఖ్యంగా Linux, Windows, macOS ఆపరేటింగ్ సిస్టమ్స్‌పై ప్రభావం చూపే ఈ లోపాలు యూజర్ల డేటా భద్రతకు ప్రమాదకరమని హెచ్చరించింది. సర్ట్-ఇన్ ప్రకారం, గూగుల్ క్రోమ్‌లోని(Chrome) 142.0.7444.59/60 వెర్షన్ కంటే పాత వేరియంట్లు ఈ లోపాలకు గురయ్యే అవకాశం ఉందని పేర్కొంది.
Read also: NFC: NFC అప్రెంటిస్ నియామకాలు ప్రారంభం!
వెంటనే అప్డేట్ చేయాల్సిన అవసరం ఎందుకు?
గూగుల్ ఇప్పటికే ఈ లోపాలను సరిచేసే నూతన సెక్యూరిటీ అప్డేట్ విడుదల చేసింది. అందువల్ల యూజర్లు వెంటనే తమ బ్రౌజర్‌ను తాజా వెర్షన్‌కు అప్డేట్ చేసుకోవాలని సర్ట్-ఇన్ సూచించింది.
క్రోమ్‌ను అప్డేట్ చేయడానికి యూజర్లు ఈ స్టెప్స్ అనుసరించాలి:
- Chrome → Settings → Help → About Google Chrome క్లిక్ చేయాలి.
- కొత్త వెర్షన్ అందుబాటులో ఉంటే అది ఆటోమేటిక్‌గా డౌన్‌లోడ్ అవుతుంది.
- తరువాత “Relaunch“ బటన్ క్లిక్ చేయడం ద్వారా అప్డేట్ పూర్తవుతుంది.
అప్డేట్ చేయకపోతే, హ్యాకర్లు స్క్రిప్ట్ ఇంజెక్షన్, రిమోట్ కోడ్ ఎగ్జిక్యూషన్, డేటా మానిప్యులేషన్ వంటి దాడులకు గురి చేసే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు.
సైబర్ భద్రతపై యూజర్లు జాగ్రత్తగా ఉండాలి
సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో యూజర్లు తమ బ్రౌజర్‌లు, యాంటీవైరస్‌లు, ఆపరేటింగ్ సిస్టమ్స్‌ను క్రమం తప్పకుండా అప్డేట్ చేసుకోవాలి. అనుమానాస్పద లింకులు లేదా వెబ్‌సైట్లు క్లిక్ చేయకుండా ఉండడం, సెక్యూర్ పాస్‌వర్డ్లు ఉపయోగించడం వంటి చర్యలు పాటించాలన్నారు సర్ట్-ఇన్ అధికారులు.
ఏ వెర్షన్ వరకు ప్రమాదం ఉంది?
142.0.7444.59/60 కంటే ముందు ఉన్న గూగుల్ క్రోమ్ వెర్షన్లు ప్రమాదంలో ఉన్నాయి.
క్రోమ్‌ను ఎలా అప్డేట్ చేయాలి?
Chrome → Settings → Help → About Google Chrome → Relaunch.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/