📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే భారీగా పెరిగిన ఛార్జీలు..నేటి నుంచి అమల్లోకి వాజ్‌పేయి జయంతి సందర్భంగా ప్రేరణా స్థల్‌కు ప్రధాని మోదీ శ్రీకారం ఇండిగోకు పోటీగా మూడు కొత్త ఎయిర్‌లైన్స్? చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే భారీగా పెరిగిన ఛార్జీలు..నేటి నుంచి అమల్లోకి వాజ్‌పేయి జయంతి సందర్భంగా ప్రేరణా స్థల్‌కు ప్రధాని మోదీ శ్రీకారం ఇండిగోకు పోటీగా మూడు కొత్త ఎయిర్‌లైన్స్? చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం

Latest Telugu news: Cholera Outbreak – నేపాల్ బిర్‌గుంజ్‌లో క‌ల‌రా వ్యాప్తి.. ముగ్గురు మృతి

Author Icon By Sudha
Updated: August 28, 2025 • 3:14 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

నేపాల్‌లోని పార్సా జిల్లాలో క‌ల‌రా వ్యాధి(Cholera Outbreak) వ్యాపిస్తున్న‌ది. వారం నుంచి ఆ కేసులు ఎక్కువ‌య్యాయి. ఇప్ప‌టి వ‌ర‌కు ముగ్గురు మృతిచెందారు. సుమారు 300 మంది అతిసారం(diarrhea)తో అస్ప‌త్రి పాల‌య్యారు. కొంద‌రి ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ది. శుక్ర‌వారం నుంచి బిర్‌కుంజ్ మెట్రోపాలిట‌న్ సిటీ ఆస్ప‌త్రిలో డ‌యేరియా వ్యాధి ల‌క్ష‌ణాల‌తో చేరుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ర్యాపిడ్ టెస్టుల ద్వారా క‌ల‌రా వ్యాపిస్తున్న‌ట్లు గుర్తించారు.

Cholera Outbreak – నేపాల్ బిర్‌గుంజ్‌లో క‌ల‌రా వ్యాప్తి.. ముగ్గురు మృతి

యాంటీజెన్ ప‌రీక్ష‌లో విబ్రియో క‌ల‌రా (Cholera Outbreak) పాజిటివ్‌గా వ‌స్తున్నారు. కాఠ్మాండులోని సెంట్ర‌ల్ ల్యాబ్ కూడా ఈ వ్యాధిని ద్రువీక‌రించింది. క‌ల‌రాకు (Cholera Outbreak)చెందిన సీరో టైప్ బ్యాక్టీరియా వ‌ల్ల బంగ్లాదేశ్‌లోనూ తీవ్ర స్థాయి ప‌రిస్థితులు త‌లెత్తే అవ‌కాశం ఉన్న‌ట్లు బిర్‌గుంజ్ ఆస్ప‌త్రి డాక్ట‌ర్లు అంచ‌నా వేశారు. బిర్‌గుంజ్‌లోని కొన్ని వార్డుల్లో కేసులు అధికంగా ఉన్నాయి. కొంద‌రు కిడ్నీ సంబంధిత వ్యాధికి గుర‌వుతున్న‌ట్లు తెలుస్తోంది. క‌ల‌రా వ్యాధి వ‌ల్ల వాంతులు, విరోచ‌నాలు వ‌స్తుంటాయి. దీని వ‌ల్ల డిహైడ్రేష‌న్ అవుతుంది. ఒక‌వేళ త‌క్ష‌ణ‌మే చికిత్స చేయ‌కుంటే, దాని వ‌ల్ల ప్రాణానికి ముప్పు ఏర్ప‌డే అవకాశం ఉంటుంది. 2009లో చివ‌రిసారి నేపాల్‌లోని జాజ‌ర్‌కోట్‌లో క‌ల‌రా మ‌హ‌మ్మారి సోకింది. అప్ప‌ట్లో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ త‌ర్వాత మ‌ళ్లీ 16 ఏళ్లకు క‌ల‌రా వ్యాపిస్తున్న‌ట్లు అధికారులు చెబుతున్నారు.

కలరా వ్యాప్తి ఎక్కడ ఉంది?

బంగ్లాదేశ్ మరియు భారతదేశంతో సహా ఆగ్నేయాసియా ప్రాంతంలో కలరా ప్రమాదం ఎక్కువగా ఉంది. ఆగ్నేయాసియాలోని అనేక దేశాలు పేదరికం మరియు రద్దీగా ఉండే నివాస ప్రాంతాలతో సహా కలరా వ్యాప్తికి దోహదపడే సవాళ్లను ఎదుర్కొంటున్నాయి.

చివరిగా కలరా ఎప్పుడు వచ్చింది?

దక్షిణ అమెరికాలో 1991–1994 వ్యాప్తి మరియు ఇటీవల, 2016–2021 యెమెన్ కలరా వ్యాప్తి వంటి అనేక ప్రధాన స్థానిక కలరా వ్యాప్తి నమోదు చేయబడింది.

మొదటి కలరా కేసు ఎప్పుడు నమోదైంది?

మొట్టమొదటిగా నమోదు చేయబడిన కలరా మహమ్మారి 1817 లో ప్రారంభమైంది మరియు ఆసియా, మధ్యప్రాచ్యం మరియు ఐరోపాలోని కొన్ని ప్రాంతాలకు వ్యాపించింది. 1854లో, ఫిలిప్పో పాసిని కలరా బాక్టీరియంను వేరుచేసి గుర్తించగా, జాన్ స్నో అదే సంవత్సరం దాని నీటి ద్వారా వ్యాపించే విధానాన్ని గుర్తించి, ఆధునిక ఎపిడెమియాలజీకి పునాది వేసింది.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/news-telugu-pakistan-150k-people-safe-after-india-warning/national/537051/

Birgunj Breaking News Cholera Deaths Cholera Outbreak holera latest news nepal Telugu News Waterborne Diseases

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.