బీహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ వేడి పెరిగింది. ఎన్డీఏ కూటమిలో భిన్నాభిప్రాయాలు మరింత బహిరంగంగా బయటపడుతున్నాయి. కేంద్ర మంత్రి, లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్ (Chirag Paswan) బీహార్ సీఎం నితీశ్ కుమార్ (Nitish Kumar)పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. ఇదే సమయంలో బీజేపీ-జేడీయూ-ఎల్‌జేపీ మధ్య సంబంధాల్లో సందేహాలు, అవిశ్వాసం పుట్టుకొస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి.రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయన్నారు. నేరాలు విపరీతంగా పెరిగిపోయాయన్నారు. ఈ మేరకు అధికారంలోని నితీశ్ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చినందుకు చింతిస్తున్నట్లు వ్యాఖ్యానించారు.
అంబులెన్స్‌లో విద్యార్థినిపై అత్యాచారం ఘటన రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. ఈ ఘటనపై స్పందించిన పాశ్వాన్ (Chirag Paswan)పాట్నాలో మీడియాతో మాట్లాడుతూ నితీశ్ కుమార్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో నేరాలు, దోపిడీలు, అత్యాచారాలు, హత్యలు, కిడ్నాప్‌లు పెరిగిపోయాయన్నారు. రాష్ట్రంలో ప్రజలు సురక్షితంగా ఉండలేకపోతున్నారన్నారు. ప్రజలను రక్షించే స్థితిలో ప్రభుత్వం లేదని.. అలాంటి ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నందుకు చింతిస్తున్నట్లు ఈ సందర్భంగా పాశ్వాన్ (Chirag Paswan)వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా అధికార యంత్రాంగం మేల్కొని నేరాల నియంత్రణకు చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల ముందు కేంద్ర మంత్రి వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
చిరాగ్ పాశ్వాన్ అర్హత?
పాశ్వాన్ ఝాన్సీలోని బుందేల్‌ఖండ్ విశ్వవిద్యాలయంలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ నుండి కంప్యూటర్ ఇంజనీరింగ్‌లో 3వ సెమిస్టర్ డ్రాపౌట్. కళాశాల నుండి మానేసిన తర్వాత, అతను మిలే నా మిలే హమ్ (2011) అనే హిందీ చిత్రంలో నటించాడు.
చిరాగ్ పాశ్వాన్ నిజ జీవితంలో ఎవరు?
చిరాగ్ రామ్ విలాస్ పాశ్వాన్ (జననం 31 అక్టోబర్ 1982) ఒక భారతీయ రాజకీయ నాయకుడు మరియు మాజీ నటుడు, అతను జూన్ 2024 నుండి 19వ ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిగా, 2021 నుండి లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) యొక్క 1వ అధ్యక్షుడిగా, 2019 నుండి 2021 వరకు లోక్ జనశక్తి పార్టీకి 2వ అధ్యక్షుడిగా మరియు .సభ్యుడుగా పనిచేస్తున్నాడు.
Read hindi newshindi.vaartha.com:
Read Also: Supreme Court: రూ.12 కోట్ల భరణం కోరిన మహిళకు సుప్రీంకోర్టు