📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

VK Shashikala New Party: ‘చిన్నమ్మ’ కొత్త పార్టీ.. జెండాను ఆవిష్కరించిన శశికళ

Author Icon By Aanusha
Updated: February 25, 2026 • 12:10 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

VK Shashikala New Party: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్ర రాజకీయాల్లో మరో కీలక మలుపు చోటుచేసుకుంది. అన్నాడీఎంకే బహిష్కృత నేత, దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి వీకే శశికళ సొంతంగా రాజకీయ పార్టీని స్థాపించనున్నట్లు ప్రకటించారు. జయలలిత 75వ జయంతిని పురస్కరించుకుని రామనాథపురంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆమె ఈ ప్రకటన చేశారు.

Read Also: Stock Market: భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

నలుపు, తెలుపు, ఎరుపు రంగులతో పాటు అన్నాదురై, ఎంజీఆర్, జయలలిత ఫోటోలను జెండాలో ఉంచారు. అనంతరం శశికళ మాట్లాడుతూ.. అన్నాదురై, ఎంజీఆర్, జయలలిత చూపిన బాటలోనే తమ పార్టీ పయనిస్తుందని ఆమె చెప్పారు. అణగారిన వర్గాలు, పేదలు, సామాన్య ప్రజానీకం కోసమే తమ పార్టీ పనిచేస్తుందని ఆమె తెలిపారు. ధైర్యం, త్యాగానికి గుర్తింపు పొందిన రామనాథపురాన్ని పార్టీ ప్రకటనకు ఉద్దేశపూర్వకంగా ఎంపిక చేసుకున్నానని చెప్పారు.

‘Chinnamma’ new party.. Sasikala unfurls the flag

వ్యక్తిగత కారణాలతో తిరస్కరించా

ఈ సందర్భంగా అమ్మ మరణాన్ని గుర్తు చేసుకుంటూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ‘ఇది తమిళనాడు ప్రజలకు, కింది స్థాయి వర్గాలకు ఒక ఉద్యమ వేదిక.. మన నాయకుల ఆదర్శాలను పునరుద్ధరించడానికి కొత్త రాజకీయ పార్టీతో ముందుకొస్తున్నాను’’ అని పేర్కొన్నారు. డిసెంబరు 2016లో జయలలిత మరణం తర్వాత తనను సీఎం పదవి చేపట్టాలని మంత్రులు, ఎమ్మెల్యేలు కోరారని అన్నారు. ‘చిన్నమ్మ మీరు ముఖ్యమంతి కావాలని వాళ్లు అన్నారు.. కానీ, అక్క చనిపోయిన బాధలో ఉన్న నేను వ్యక్తిగత కారణాలతో తిరస్కరించాను.. పన్నీర్ సెల్వమ్‌ను సీఎం కొనసాగించాలని భావించాను’’ అని అన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Jayalalithaa 75th Birth Anniversary Tamil Nadu elections 2026 VK Sasikala New Party

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.