Chhattisgarh steel plant blast : ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని **బలోడా బజార్ జిల్లా**లో గురువారం ఉదయం ఘోర విషాదం చోటుచేసుకుంది. ప్రైవేట్ స్టీల్ ప్లాంట్‌లో ఉన్న బొగ్గు కొలిమి అకస్మాత్తుగా పేలిపోవడంతో ఏడుగురు కార్మికులు మంటల్లో చిక్కుకుని సజీవ దహనమయ్యారు. ఈ ఘటనలో మరో పది మందికి పైగా కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు.
బలోడా బజార్ జిల్లాలోని బకులాహి ప్రాంతంలో ఉన్న **రియల్ ఇస్పాట్ స్టీల్ ప్లాంట్**లో ఈ ప్రమాదం జరిగింది. గురువారం ఉదయం కార్మికులు తమ విధుల్లో భాగంగా బొగ్గు కొలిమి ప్రాంతంలో శుభ్రపరిచే పనులు చేస్తున్నారు. అదే సమయంలో ఊహించని విధంగా కొలిమి భారీ శబ్దంతో పేలిపోయింది.
పేలుడు ధాటికి మండుతున్న బొగ్గు, తీవ్రమైన వేడిమి (Chhattisgarh steel plant blast) కార్మికులపై పడటంతో అక్కడ పనిచేస్తున్న ఏడుగురు కార్మికులు తప్పించుకునే అవకాశం లేక అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద సమయంలో కొలిమి చుట్టుపక్కల ఉన్న మరికొందరు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు.
Read Also: Chittoor: చంద్రబాబు చిత్తూరు జిల్లా పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్
ప్రమాదం జరిగిన వెంటనే ప్లాంట్ మొత్తం దట్టమైన పొగలు, మంటలు అలుముకున్నాయి. ఈ మంటలు కిలోమీటరు దూరం వరకు కనిపించడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించారు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. స్టీల్ ప్లాంట్‌లో భద్రతా నిబంధనలు పాటించారా లేదా అన్న అంశంపై అధికారులు విచారణ చేపట్టారు. కొలిమి పేలడానికి గల సాంకేతిక కారణాలను నిపుణుల ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. యాజమాన్యం నిర్లక్ష్యం ఉన్నట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా యంత్రాంగం స్పష్టం చేసింది. ఈ ప్రమాదం మృతుల కుటుంబాల్లో తీరని విషాదాన్ని మిగిల్చింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: