📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Chhattisgarh: మావోయిస్టులపై ఆఖరి పోరుకు పోలీస్ ఆపరేషన్

Author Icon By Saritha
Updated: January 17, 2026 • 11:31 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

టార్గెట్ పశ్చిమ బస్తర్ డివిజన్ కార్యదర్శి పాపారావు..

హైదరాబాద్ : మావోయిస్టు (Maoists) ఏరివేతకు డెడ్లైన్ దగ్గర పడుతుండడంతో ఛత్తీస్ ఘడ్లో భద్రతా బలగాలు నక్సల్స్ విముక్త ఆపరేషన్ ను మరింత వేగవంతం చేశారు. గడచిన మూడు నెలల కాలంలో అనూహ్యంగా వెయ్యి మందికి పైగా నక్సలైట్లు లొంగిపోవడం, వందల సంఖ్యలో ఎన్ కౌంటర్ లో చనిపోవడం, భద్రతా బలగాల తరపున ఎలాంటి నష్టం లేకపోవడంతో పోలీసులు ఉత్సాహంగా మావోయిస్టుల ఏరివేతకు అంతిమ యుద్ధం మొదలుపెట్టారు. (Chhattisgarh) ఈసారి పోలీసులు టార్గెట్గా ఛత్తీస్ ఘడ్లోని పశ్చిమ బస్తర్ డివిజన్ కార్యదర్శి పాపారావును ఎంచుకుని ముందుకు సాగుతున్నట్లు తెలిసింది. పాపారావు దశాబ్దకాలానికి పైగా పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్నారు. ఆయనపై 50 లక్షల రూపాయల రివార్డు వుంది. వచ్చే మార్చి నెలాఖరుకు దేశంలో మావోయిస్టులను లేకుండా చేస్తామని ప్రకటించిన కేంద్రం అందుకు అనుగుణంగా నక్సల్స్ ను పట్టున్న ఛత్తీస్ ఘడ్ అటవీ ప్రాంతంలో వేల సంఖ్యలో భద్రతా బలగాలను మొహరించడం తెలిసిందే.

Read also: ‘Bad Situation’ : స్వదేశానికి చేరుకున్న భారతీయులు

Police operation launched for the final battle against the Maoists.

లొంగిపోయిన నక్సలైట్ల సహకారంతో వ్యూహాత్మక దాడులు

పోలీసుల ఒత్తిడి ఫలించడంతో వందల సంఖ్యలో నక్సలైట్లు (Chhattisgarh) ఛత్తీస్ ఘడ్ తో పాటు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, తెలుగు రాష్ట్రాల్లో లొంగిపోతుండడం విదితమే. దీంతో పాటు ఛత్తీస్ ఘడ్లో ఇప్పటికీ ఎన్ కౌంటర్లు జరుగుతూనే వున్నాయి. పోలీసులకు టార్గెట్గా వున్న ముఖ్య నేతల్లో హిడ్మా సహా పలువురు ఎన్ కౌంటర్ లో చనిపోగా మల్లోజుల, దేవా సహా మరికొందరు లొంగిపోయారు. లొంగిపోయిన నక్సలైట్ల సహకారంతో అజ్ఞాతంలో వున్న నక్సలైట్లతో పోలీసులు సంప్రదింపులు జరిపి వారిని కూడా లొంగిపోయేలా చేస్తున్నారు. ఇక తాజా విషయానికి వస్తే ఛత్తీస్ఫడ్లో మరో కీలక నేతను భద్రతా బలగాలు టార్గెట్ చేశాయి. మావోయిస్టు ఉద్యమంలో ముఖ్య భూమిక వహించిన వారిలో ఒకడుగా వున్న సున్నం చంద్రయ్య అలియాస్ ముంగు ఊరఫ్ పాపారావును పోలీసులు లక్ష్యంగా చేసుకుని కూంబింగ్ చేబట్టారు. సుక్మా జిల్లా నిమ్మలగూడెం గ్రామానికి చెందిన పాపారావు పశ్చిమ బస్తర్ డివిజన్కు కార్యదర్శిగా, దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడుగా వున్నారు.

50 లక్షల రివార్డుతో కీలక నేతపై గాలింపు

మావోయిస్టు పార్టీలో ప్రస్తుతమున్న పది మంది కీలక నేతల్లో పాపారావు ఒకరు కావడం, ఆయన ఆధ్వర్యంలోనే దండకారణ్య విభాగం పనిచేస్తుండడంతో భద్రతా బలగాలు ఆయననే టార్గెట్ చేసుకున్నాయి. బీజాపూర్, సుక్మా జిల్లాలలో వంద మంది వరకు చురుకైన నక్సలైట్లు ఇప్పటికీ వున్నారని, సులభంగా వీరందరికి పాపారావు నాయకుడని పోలీసు బలగాలకు సమాచారం అందింది. పోలీసుల నుంచి వీరంతా తప్పించుకుంటున్నారని, దీనివెనుక పాపారావు వ్యూహాలు వున్నాయని భద్రతా బలగాలు గుర్తించాయి. పాపారావు వ్యూహాలను గమనించిన పోలీసులు దానికి విరుగుడుగా లొంగిపోయిన నక్సలైట్లను తమ వెంట తీసుకుని ప్రతి వ్యూహాలను అమలు చేస్తున్నారని తెలిసింది. పాపారావుపై 50 లక్షల రూపాయల రివార్డు వుండడంతో ఆయనను ఈ నెలాఖరులోగా ఎలాగైనా పట్టుకోవాలని పోలీసులు భావిస్తున్నారు.

ఈ క్రమంలోనే గాలింపును పెంచారు. పాపారావు వుండే ప్రాంతంలోనే మావోయిస్టు అగ్రనేతలు దేవ్ జీ, మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్, గణపతి తదితరులు వుం డివుంటారని భద్రతా బలగాలు భావిస్తున్నాయి. ఇదే సమయంలో మావోయిస్టు పార్టీలో వివిధ హోదాలో పనిచేసి వున్నట్లుండి అజ్ఞాతంలో వెళ్లిన 52 మంది గురించి కూడా భద్రతా బలగాలు ముమ్మరంగా గాలింపు చేబట్టాయి. అజ్ఞాతంలో వున్న వారిలో 17 మంది చురుకుగా వున్నటు పోలీసులకు సమాచారం అందగా మిగతావారి ఆచూకీ వెలుగు చూడలేదు. వీరిలో తెలంగాణకు చెందిన వారు ఎక్కువ.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:



Chhattisgarh Latest News in Telugu Left Wing Extremism Maoists naxalites Paparao police operation security forces Telugu News West Bastar Division

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.