Chhattisgarh: కన్నబిడ్డ మరణిస్తే ఆ తల్లిదండ్రుల గుండెల్లో చెలరేగే మంటను కాలం కూడా ఆపలేదు. కుమారుడు మరణించి ఏడాది గడిచినా కొడుకు జ్ఞాపకాలు వారిని నిలువనీయలేదు. జంజ్‌గిర్-చంపా జిల్లాలోని దార్దెయ్ గ్రామానికి చెందిన 48 ఏళ్ల కృష్ణ పటేల్ వృత్తిరీత్యా మేస్త్రీ. ఆయన భార్య 47 ఏళ్ల రమా బాయి గృహిణి. వీరికి 21 ఏళ్ల కుమారుడు ఆదిత్య పటేల్ ఉండేవాడు. 2024లో జరిగిన ఒక రోడ్డు ప్రమాదం (Road accident) ఈ కుటుంబంలో చీకటి నింపింది. అప్పటి నుంచి ఆ దంపతులు జీవచ్ఛవాల్లా మారారు. కొడుకు చనిపోయిన ఏడాది తర్వాత ఆ బాధను ఇక భరించలేమని భావించిన దంపతులు.. ఆదివారం అర్ధరాత్రి తమ ఇంటి ఆవరణలోని వేప చెట్టుకు ఉరివేసుకున్నారు.
Read Also: Maharashtra: NCP జాతీయ అధ్యక్షురాలిగా సునేత్రా పవార్ బాధ్యతలు!
కంటతడి పెట్టిస్తున్న సూసైడ్ నోట్
చనిపోవడానికి ముందు కృష్ణ పటేల్ రాసిన నాలుగు పేజీల లేఖలో ప్రతీ అక్షరం కన్నీళ్లు తెప్పిస్తోంది. ఆదిత్య మా జీవిత పునాది. మా సర్వస్వం. దేవుడు మాకు ఇచ్చిన గొప్ప వరం. కానీ ఒక రోజు ఆలయ పని కోసం వెళ్లమని నేనే వాడిని బలవంతం చేశాను. ‘దేవుడి పని కదా వెళ్లు’ అని నేను పంపడమే నా జీవితంలో నేను చేసిన అతిపెద్ద తప్పు. వాడు శాశ్వతంగా నన్ను విడిచి వెళ్లిపోయాడు. నేను శ్వాస తీసుకుంటున్నాను కానీ జీవించడం లేదు అంటూ లేఖలో పేర్కొన్నారు. ఆత్మహత్యకు ముందు దంపతులు వీడియోలో తమ లాయర్‌ను ఉద్దేశించి, ఇన్సూరెన్స్ క్లెయిమ్ డబ్బులు కుటుంబ సభ్యులకు కుల్భరా పటేల్, జల్భరా పటేల్‌లకు అందించమని కోరారు. మేము ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నాం. శివునిలో ఐక్యమవుతున్నాం. మా చావుకు ఎవరూ బాధ్యులు కారు. మమ్మల్ని సంతోషంగా పంపించండి అని చెప్పారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: