📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె

Latest Telugu News: Chhattisgarh: తండ్రి ఆస్తిలో కూతురుకు వాటా ఉండదు.. ఛత్తీస్‌గఢ్ హైకోర్టు

Author Icon By Vanipushpa
Updated: October 25, 2025 • 4:42 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తండ్రి ఆస్తిపై కూతురుకు వారసత్వంపై కేసులో ఛత్తీస్‌గఢ్ హైకోర్టు(Chhattisgarh High Court) కీలక తీర్పును వెలువరించింది. 1956 చట్టానికి ముందు ఉన్న లా ప్రకారం.. కుమార్తెలు తండ్రి ఆస్తిలో వాటా పొందలేరని తెలిపింది. హిందూ వారసత్వ చట్టం, 1956 అమల్లోకి రాకముందే తండ్రి ఆస్తి మీద వారసత్వం ప్రారంభమైతే.. కుమార్తె తన తండ్రి ఆస్తిలో ఎటువంటి వాటాను క్లెయిమ్ చేయడానికి వీల్లేదని ఛత్తీస్‌గఢ్ హైకోర్టు స్పష్టం చేసింది. హిందూ వారసత్వ చట్టం, 1956 కన్నా ముందు ఉన్న వారసత్వం మితాక్షర చట్టం (Mitakshara Law) ద్వారా కొడుకే తండ్రి ఆస్తికి వారసుడు అవుతాడని తేల్చి చెప్పింది. మితాక్షర చట్టం ప్రకారం, పురుష హిందువుల ప్రత్యేక ఆస్తి, మగ వారసులు ఉన్నప్పుడు కేవలం కొడుక్కి మాత్రమే వెళ్తుంది.

 Read Also: Amit Shah : మహాఘట్బంధన్‌కు ఓటువేస్తే ఆటవిక పాలనే : అమిత్‌ షా

Chhattisgarh

కేసు నేపథ్యం ఇది..

TOI నివేదిక ప్రకారం.. ఈ తీర్పు రాగ్మానియా అనే మహిళ.. తన తండ్రి ఆస్తిలో వాటా కోసం దాఖలు చేసిన కేసులో జస్టిస్ నరేంద్ర కుమార్ వ్యాస్ అక్టోబర్ 13న వెలువరించారు. కేసు పూర్వాపరాలు ఏంటంటే.. రాగ్మానియా సుర్గుజా జిల్లాలోని తన తండ్రి పూర్వీకుల ఆస్తిలో వాటా కోసం దావాను దాఖలు చేసింది. దిగువ కోర్టులు ఆమె వాదనను తిరస్కరించాయి. హైకోర్టు ఈ నిర్ణయాన్ని ధృవీకరించి, 1956కి ముందు మరణించిన హిందువుల ఆస్తులు మితాక్షర చట్టం ప్రకారం మాత్రమే నిర్వహించబడతాయని దిగువ కోర్టుల వాదనను సమర్థించింది. రాగ్మానియా 2005లో తన తండ్రి సుధిన్ ఆస్తిలో టైటిల్, విభజన కోసం సివిల్ దావా పెట్టింది.

ఆమెకు ఆస్తి వారసత్వ హక్కు ఉంది కానీ..

ఆమె వాదన ప్రకారం, ఆమెకు ఆస్తి వారసత్వ హక్కు ఉంది. కానీ, ట్రయల్ కోర్టు, అప్పీలేట్ కోర్టులు రెండూ 1956కి ముందు ప్రారంభమైన వారసత్వంపై హిందూ వారసత్వ చట్టం వర్తించదని నిర్ధారించాయి. హైకోర్టు కూడా ఇదే నిర్ణయాన్ని తెలిపింది. కోర్టు తీర్పులో.. 1950-51 ప్రాంతంలో మరణించిన హిందువుల ఆస్తి, మితాక్షర చట్టం ప్రకారం మగ వారసులకు మాత్రమే వెళ్తుందని స్పష్టంగా పేర్కొన్నది. సుప్రీంకోర్టు పూర్వపు తీర్పులను కూడా కోర్టు ఉదహరించింది, వీటిలో అర్ష్నూర్ సింగ్ vs హర్పాల్ కౌర్ (2020), అరుణాచల గౌండర్ vs పొన్నుసామి (2022) ఉన్నాయి. ఈ కేసులు చూపిన విధంగా.. 1956కి ముందు మరణించిన హిందువుల ఆస్తిలో, మగ బిడ్డలు ఉన్నప్పుడు ఆడ బిడ్డలకు వారసత్వ హక్కు రాదు. జస్టిస్ నరేంద్ర కుమార్ వ్యాస్ తీర్పును వెలువరుస్తూ..మితాక్షర చట్టం ప్రకారం పాలించబడే ఒక హిందువు 1956కి ముందు మరణించినప్పుడు, అతని ప్రత్యేక Property పూర్తిగా అతని కొడుక్కి వెళ్తుంది. మగ బిడ్డలు ఎవరూ లేనప్పుడు మాత్రమే ఆడ బిడ్డ ఆస్తిలో హక్కు పొందగలదు. సుధిన్‌కు కొడుకు ఉన్నందున, రాగ్మానియాకు ఆస్తిలో వాటా లభించదని తేల్చి చెప్పింది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

Chhattisgarh High Court Daughter Indian Judiciary Inheritance Law Latest News Breaking News Legal News Property Rights Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.