📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

News Telugu: Chhattisgarh: మావోయిస్టులపై మరిన్ని దాడులకు ఛత్తీస్ గఢ్ కు అదనపు బలగాలు

Author Icon By Rajitha
Updated: September 25, 2025 • 11:03 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

లొంగుబాట్లను పెంచేందుకు మాజీ నక్సల్స్ సేవలను వాడుకోవాలని నిర్ణయం హైదరాబాద్ : దేశంలో వచ్చే ఏడాది మార్చి 31వ నాటికి మావోయిస్టులను Maoist పూర్తిగా ఏరివేస్తామని ప్రకటించిన కేంద్రం అందుకు తగినట్లుగా నక్సలైట్లకు పట్టున్న ఛత్తీస్మడ్కు మరిన్ని పారా మిలటరీ బలగాలను పంపాలని నిర్ణయించింది. ఇందుకోసం కాశ్మీర్ సహా ఉత్తరాది రాష్ట్రాలలో వున్న సిఆర్పిఎఫ్ CRPF బలగాల నుంచి 70 శాతం బలగాలను ఛత్తీస్మడ్కు పంపాలని కేంద్రం నిర్ణయించింది. ఇదే సమయంలో నక ్సలైట్ల లొంగుబాట్లను మరింతగా పెంచాలని, ఇందుకోసం మాజీ మిలిటెంట్ల సేవలను వాడుకోవాలని పోలీసు ఉన్నతాధికారులకు కేంద్రం ఆదేశించిందని సమాచారం. ప్రస్తుతానికి ఒక్క చత్తిస్గఢ్లోనే నక్సలైట్ల ప్రభావం వుండగా మహారాష్ట్ర, ఒడిషా, ఝార్కండ్లో కొంతమేర వుందని నిఘా వర్షాలు కేంద్రానికి నివేదికలు పంపాయి. ఈ మూడు రాష్ట్రాల పోలీసులను ఆప్రమత్తం చేయడంతో పాటు ఛత్తీస్‌గఢ్, భారీగా సాయుధ ఆపరేషన్లను పెంచాలని కేంద్రం ఆదేశించింది. నక్సల్స్ విముక్త భారత్ కోసం కేంద్రం చివరి వ్యూహాన్ని పక్కాగా అమలు చేసేందుకు పావులు కదుపుతోంది. Chhattisgarh నక్సల్స్ ఖిల్లా అబూజ్మడ్ను ఇప్పటికే 70 శాతం స్వాధీనం కేసుకోగా మిగతా 30 శాతం ప్రాంతాన్ని వచ్చే ఏడాది మార్చి 31వ కల్లా తమ అదుపులోకి తీసుకునేందుకు భారీగా పారా మిలటరీ బలగాలను మొహరించసాగింది.

Chhattisgarh

మావోయిస్టుల కోసం ఓవైపు భారీగా కూంబింగ్ చేస్తూనే మరోవైపు బొంగుబాట్లను కేంద్రం ప్రోత్సహిస్తుండడం తెలిసిందే. ఈ క్రమంలోనే ఓవైపు వరుస ఎన్ కౌంటర్లలో మావోయిస్టు అగ్ర నాయకులు హతమవుతుండగా మరోవైపు పదుల సంఖ్యలో నక్సలైట్లు పోలీసులకు లొంగిపోతున్నారు. బుధవారం నాడు ఏకంగా 74 మంది నక్సలైట్లు ఆయుధాలతో ఛత్తీస్ఘడ్లోని దంతేవాడ జిల్లా పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఇంత భారీ సంఖ్యలో నక్సలైట్లు లొంగిపోవడం ఇదే తొలిసారి. నాలుగు రోజుల క్రితం జరిగిన ఎన్ కౌంటర్లో ఇద్దరు మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు కట్టా రామచంద్రా రెడ్డి, రదారి సత్యనారాయణ రెడ్డిలతో పాటు మరో ముగ్గురు ముఖ్య నేతలు మరణించారు. ఓ వైపు లొంగుబాట్లు పెరిగిపోవడం ఇంకోవైపు ముఖ్య నేతలు ఎన్ కౌంటర్లో మరణిస్తుండడం మావోయిస్టు పార్టీని కోలుకోలేని దెబ్బ తీస్తోంది. ఇదే సమయంలో మావోయిస్టు పార్టీ ముఖ్యనేత కేంద్ర అధికార ప్రతినిధి అభయ్ అలియాస్ మల్లోజుల వేణుగోపాల్ రావు పార్టీకి రాసిన లేఖ తీవ్ర కలకలం రేపింది. మావోయిస్టు పార్టీ ఆయుధాలు వీడాలని, కేంద్రంతో చర్చలు జరపాలని లేఖ విడుదల చేయడం సంచలనం రేపింది. ఆభయ్ లేఖను మావోయిస్టు పార్టీ తప్పుపట్టడంతో పాటు ఆయనను ద్రోహిగా ప్రకటించింది. అభయ్ వెంటనే ఆయుధాలను పార్టీకి అప్పగించాలని, లేకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.

Chhattisgarh

అభయ్ పోలీసులకు లొంగిపోవాలని నిర్ణయించి ఇలాంటి ప్రకటన చేస్తున్నారని మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ విమర్శించింది. అయితే మావోయిస్టు పార్టీ ప్రకటనను ఛత్తీస్ఫడ్ రాష్ట్ర పోలీసులు ఖండించారు. ఆభయ్ తమతో వున్నాడనడం నిజం కాదని, అది వారి అంతర్గత సమస్యగా ఛత్తీస్‌గఢ్, పోలీసులు చెబుతున్నారు. Chhattisgarh మావోయిస్టులు మారిన పరిస్థితుల్లో ఆయుధాలను విడనాడి. పోరుబాటను విడిచి జనజీవన స్రవంతిలో కలవాలని, మొండిగా ముందుకు వెళితే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వుంటుందని హెచ్చరించారు. తెలంగాణ పోలీసులతో కొన్నిచోట్ల వున్న కొందరు మావోయిస్టు ముఖ్య నేతలు…?: ఇదిలావుండగా మావోయిస్టు పార్టీకి చెందిన కొందరు ముఖ్య నేతలు తెలంగాణ పోలీసులతో లొంగిపోయేందుకు సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం, పది రోజుల క్రితం ఆ పార్టీకి చెందిన ముఖ్య మహిళా నేత సుజాత (దివంగత మావోయిస్టు ఆగ్ర నాయకుడు మల్లోజుల కోటేశ్వరరావు Mallojula Koteswara Rao అలియాస్ కిషన్ జీ సతిమణి) లొంగిపోవడం తెలిసిందే. సుజాత బాటలోనే మరో ఐదారుగురు తెలంగాణ పోలీసులకు లొంగిపోయేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసుల ఎదుట పదుల సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోవడం తెలిసిందే. వీరిద్వారా కొందరు ముఖ్య నేతలను లొంగిపోయేలా రాష్ట్ర పోలీసులు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది.

మావోయిస్టులపై దాడులు మరింతగా పెంచేందుకు కేంద్రం ఏ నిర్ణయం తీసుకుంది?
ఛత్తీస్‌గఢ్‌లో అదనపు పారా మిలటరీ బలగాలను మోహరించాలని నిర్ణయించింది. ఇందుకోసం కాశ్మీర్ సహా ఉత్తరాది రాష్ట్రాల సిఆర్పిఎఫ్ బలగాల నుంచి 70% ను ఛత్తీస్‌గఢ్‌కి పంపనుంది.

మావోయిస్టుల లొంగుబాట్లను పెంచేందుకు కేంద్రం ఏ వ్యూహం అమలు చేస్తోంది?
A: మాజీ నక్సల్స్ సేవలను వినియోగించుకోవాలని, వారిని లొంగుబాట్ల ప్రోత్సాహానికి ఉపయోగించాలని నిర్ణయించింది.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

Breaking News Central Government Chhattisgarh CRPF latest news Maoists naxalites paramilitary forces security operations surrenders Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.