చెన్నై: ఈ మధ్యకాలంలో పెళ్లిళ్లు ప్రేమతో, భద్రతతో నిండిన బంధంగా కాక.. దారుణాలకు దారి తీసే వేదికలుగా మారిపోతున్నాయి. ఓ వైపు కుటుంబ పెద్దల ఒత్తిడితో పెళ్లికి ఒప్పుకుంటున్న యువతులు, మరోవైపు ప్రేమలో ఉన్న వారి వెంట వెళ్లేందుకు ఏకంగా భర్తలను హత్య చేయించడానికి కూడా వెనుకాడడం లేదు. తమిళనాడు రాజధాని చెన్నైలోని మాధవరం ప్రాంతంలో ఒక ఆశ్చర్యకరమైన సంఘటన వెలుగులోకి వచ్చింది.పెళ్ళైన రోజు మధ్యాహ్నమే, కొత్త పెళ్ళికూతురు తన ప్రియుడితో కలిసి పారిపోయింది. మాధవరంలోని బర్మా కాలనీకి చెందిన విజయకుమార్ (Vijayakumar) అనే వ్యక్తికి, పెరంబూరులోని అంబేద్కర్ నగర్‌కు చెందిన అర్చనలకు శుక్రవారం బెసెంట్ నగర్ చర్చిలో ఉదయం ఆరు గంటలకు వివాహం జరిగింది.పెళ్ళి జరిగిన రోజు సాయంత్రం రిసెప్షన్ ఉంది. దీంతో అర్చన బ్యూటీ పార్లర్‌కి వెళ్తున్నానని చెప్పి బయటకు వెళ్లింది. అటునుంచి ఆమె తన ప్రియుడి దగ్గరకు వెళ్లి పోయింది.
తమకు ముందే ఈ విషయం చెబితే ఇంత వరకు వచ్చేవాళ్లం
బ్యూటీ పార్లర్‌కు వెల్లిన అర్చ ఎంతసేపటికీ తిరిగి రాకపోవడంతో ఆమె అత్తింటి వారికి అనుమానం వచ్చింది. దీంతో ఆమె కోసం వెతకడం మొదలుపెట్టారు.ఈ క్రమంలో వారికి అర్చన బ్యూటీ పార్లర్‌కి వెళ్లలేదని తెలిసింది. ఆమె తన ప్రియుడు కలైతో కలిసి పారిపోయిందని వెల్లడైంది. దీంతో అర్చన (Archana) తల్లి నాగవల్లి తిరువిగ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. దీంతో శుక్రవారం,సాయంత్రం అర్చన తిరువిగనగర్ పోలీస్ స్టేషన్‌కు వచ్చింది. ఆమె విజయకుమార్‌కు క్షమాపణ చెప్పింది. తాను ప్రేమించిన వాడితోనే కలిసి ఉంటానని తేల్చి చెప్పింది. తమకు ముందే ఈ విషయం చెబితే ఇంత వరకు వచ్చేవాళ్లం కాదు కదా అని పెళ్లి కొడుకు కుటుంబం ఆమెపై మండి పడింది. ఎంగేజ్‌మెంట్, పెళ్లికి అయిన ఖర్చు ఎవరు భరిస్తారని వారు ప్రశ్నించారు. అర్చన కుటుంబ సభ్యులు పెళ్లి ఖర్చులకు పరిహారం ఇస్తామని ఒప్పుకున్నారు.
వరికి హానీ చేయకుండా తన జీవితం తాను చూసుకుంది
ఈ విషయం తెలుసుకున్న స్థానికులు, నెటిజనులు నువ్వు అదృష్టవంతుడి బ్రదర్, భార్య, ప్రియుడి చేతిలో హత్యకు గురికాకుండా తప్పించుకున్నావు. ఈ అమ్మాయి కాస్త మంచిది. ఎవరికి హానీ చేయకుండా తన జీవితం తాను చూసుకుంది అని కామెంట్ చేస్తున్నారు. ఈ సంఘటన ఇప్పుడు సోషల్ మీడియా (Social media) లో వైరల్ అవుతోంది.ఈ సంఘటన ఆధునిక కాలంలో పెళ్లిళ్లలో వ్యక్తిగత స్వేచ్ఛ, ప్రేమ సంబంధాల ప్రాముఖ్యత, పెద్దల ఒత్తిడి కారణంగా జరిగే పెళ్లిళ్లలో భార్యాభర్తల మధ్య అవగాహన అవసరం వంటి అంశాలపై చర్చకు దారి తీస్తోంది.
Read hindi news: hindi.vaartha.com
Read Also: Madrasa Teacher: మదరసా టీచర్ ఘాతుకం: మూడేళ్లుగా యువతిని బంధించి లైంగిక దాడులు