Chennai crime news : ప్రియుడితో కూతురిపై దారుణం, చెన్నై ఘటన షాక్!

Read Time:  1 min
Chennai crime news
Chennai crime news
FONT SIZE
GET APP

Chennai crime news : చెన్నైలో సభ్య సమాజాన్ని కలవరపరిచే అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉందనే కోపంతో ఓ తల్లి, తన ప్రియుడితో కలిసి కన్నకూతురిపైనే దారుణానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా బయటపడింది. ఈ సంఘటన సాలిగ్రామం ప్రాంతంలో చోటుచేసుకుంది.

వాచ్‌మెన్‌గా పనిచేస్తున్న వ్యక్తి భార్య, తన ప్రియుడు దక్షిణామూర్తి (50)తో సన్నిహితంగా ఉండేది. ఈ విషయాన్ని గమనించిన 20 ఏళ్ల కుమార్తె తల్లిని ప్రశ్నించడంతో ఆమెపై కక్ష పెంచుకుంది. గత నెల 3న అనారోగ్యంగా ఉన్న కుమార్తెకు నిద్రమాత్రలు ఇచ్చి మత్తులోకి జారుకున్న తర్వాత ప్రియుడితో అఘాయిత్యానికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు.

Read Also:Ramchandar Rao: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి హౌస్ అరెస్ట్?

Chennai crime news
Chennai crime news

అదే నెల 23న మరోసారి ప్రయత్నం చేయగా (Chennai crime news) యువతి స్పృహలోకి వచ్చి కేకలు వేయడంతో ఘటన బయటపడింది. భయంతో అక్కడి నుంచి తప్పించుకున్న బాధితురాలు తిరువణ్ణామలైలో బంధువుల వద్ద ఆశ్రయం పొందింది. కడుపునొప్పితో ఆసుపత్రికి తీసుకెళ్లగా ఆమె గర్భవతిగా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో బాధితురాలు జరిగిన ఘటనను బంధువులకు వివరించగా వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడు దక్షిణామూర్తిని అరెస్ట్ చేశారు. ఈ కుట్రలో తల్లి పాత్రపై లోతైన విచారణ కొనసాగుతోంది. బాధితురాలికి వైద్య చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Sai Kiran

రచయిత గురించి

Sai Kiran

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.