Chennai: మహిళా ఉద్యోగినిపై డెలివరీ బాయ్ అత్యాచారయత్నం

Read Time:  1 min
Chennai: మహిళా ఉద్యోగినిపై డెలివరీ బాయ్ అత్యాచారయత్నం
FONT SIZE
GET APP

చెన్నై(Chennai) లోని కుబేరన్ నగర్ ప్రాంతంలో ఇటీవల చోటుచేసుకున్న ఓ దారుణ ఘటన, నగరాన్ని కలచివేసింది. సామాజిక భద్రతపై తీవ్ర ఆందోళనలు కలిగించే ఈ సంఘటనలో, ఇంటి వద్ద కిరాణా సరుకులు డెలివరీ చేయడానికి వచ్చిన ఓ యువకుడు, ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళా ఐటీ ఉద్యోగిని మీద అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు.

సంఘటన వివరాలు:

వివరాల్లోకి వెళ్తే, మడిపాక్కంకు చెందిన ఓ మహిళా ఐటీ ఉద్యోగిని జెప్టో (Zepto) యాప్ ద్వారా కిరాణా సామాగ్రికి ఆర్డర్ చేయగా, గోపీనాథ్ అనే డెలివరీ బాయ్ సరుకులను తీసుకుని ఆమె ఇంటికి వచ్చాడు. సెల్ ఫోన్ చార్జింగ్ లేదని చెప్పి, కాసేపు చార్జింగ్ పెట్టుకుంటానని అతను కోరడంతో, ఆమె అతన్ని లోపలికి అనుమతించింది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడాన్ని గమనించిన గోపీనాథ్ ఆమెపై అత్యాచారానికి ప్రయత్నించాడు. ఆమె గట్టిగా కేకలు వేయడంతో అతను అక్కడి నుంచి పారిపోయాడు.

బాధితురాలి ధైర్యంగా స్పందన:

ఘటన జరిగిన వెంటనే బాధితురాలు జెప్టో సంస్థకు ఫిర్యాదు చేశారు. అయితే, వారు దీనిపై స్పందించలేదు. ఓ మహిళా కస్టమర్ అత్యంత అసురక్షితంగా ఉన్నప్పటికీ, సంస్థ నిర్వాకంగా వ్యవహరించిందన్న ఆరోపణలు సోషల్ మీడియాలో విపరీతంగా పుట్టుకొచ్చాయి.

పోలీసుల స్పందన:

బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, నిందితుడిపై కేసు నమోదు చేశారు. పోలీసులు వెంటనే స్పందించి, నిందితుడు గోపీనాథ్‌ను అరెస్టు చేశారు. ఈ ఘటనపై జెప్టో యాజమాన్యం స్పందించకపోవడంపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Read also: Hyderabad: ఒకే కుటుంబంలో ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఆత్మహత్య

Tiger: సియోని జిల్లాలో ఇద్దరిని బలిగొన్న పులి ఎట్టకేలకు పట్టివేత

Sharanya

రచయిత గురించి

Sharanya

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.