📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Latest news: Face Recognition Cameras: అత్యంత కట్టు దిట్టమైన భద్రతలో చర్లపల్లి రైల్వే స్టేషన్

Author Icon By Saritha
Updated: November 22, 2025 • 4:27 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

చర్లపల్లి(Cherlapalli) రైల్వే టెర్మినల్‌ ఇప్పుడు అత్యాధునిక భద్రతా వ్యవస్థలకు నిలయంగా మారింది. ప్రయాణికుల రక్షణను బలోపేతం చేయడం, అనుమానితుల కదలికలను పర్యవేక్షించడం, అక్రమ కార్యకలాపాలను(Face Recognition Cameras) అరికట్టడం కోసం స్టేషన్‌లో ఫేస్ రికగ్నిషన్‌ (ఎఫ్‌.ఆర్‌) టెక్నాలజీతో కూడిన కెమెరాలను ఏర్పాటు చేశారు. అనుమానితులు స్టేషన్‌ పరిధిలో ప్రవేశించిన వెంటనే వారి వివరాలు గుర్తించే ఈ వ్యవస్థ రైల్వే భద్రతా ప్రమాణాలను మరింతగా పెంచనుంది.

టెర్మినల్‌లో మొత్తం 250 సీసీటీవీలు ఉండగా, వాటిలో 15 అత్యాధునిక ఎఫ్‌.ఆర్‌ కెమెరాలు ఉన్నాయి. ప్రవేశ ద్వారాలు, టికెట్‌ కౌంటర్లు, ప్లాట్‌ఫార్ములు, విశ్రాంతి గదులు, ఏటీవీఎం కేంద్రాలు వంటి కీలక ప్రాంతాల్లో వీటిని అమర్చారు. స్టేషన్‌లో ఏర్పాటు చేసిన కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌ ద్వారా ప్రతి కెమెరా నుండి వచ్చే వీడియోలను రియల్ టైమ్‌లో పరిశీలిస్తూ అనుమానితుల వివరాలను డేటాబేస్‌తో తక్షణమే పోల్చి గుర్తిస్తున్నారు.

Read also: తొలి టెస్ట్.. ఆస్ట్రేలియా ఘన విజయం

Face Recognition Cameras in Cherlapalli Railway Station

మృతదేహం కేసు విచారణలో ఎఫ్‌.ఆర్‌. టెక్నాలజీ కీలక పాత్ర

ఇటీవల గోనెసంచిలో మృతదేహం(Face Recognition Cameras) లభించిన ఘటనను ఛేదించడంలో ఈ ఫేస్ రికగ్నిషన్‌ సిస్టమ్‌ కీలక పాత్ర పోషించింది. నిందితుడి ముఖాన్ని కేవలం కొన్ని సెకన్లలో స్కాన్ చేసి, డేటాబేస్‌తో మ్యాచ్ చేసి పోలీసులకు సందేశం పంపడంతో అతడిని గుర్తించడం సాధ్యమైంది. దీంతో చర్లపల్లి స్టేషన్‌లో ఈ టెక్నాలజీ భద్రతా వ్యవస్థకు గట్టి బలం అయ్యింది. ఈ ఎఫ్‌.ఆర్‌. సిస్టమ్‌ ఏఐ ఆధారంగా 3–5 సెకన్లలో వ్యక్తి ముఖ లక్షణాలను విశ్లేషించి, డేటాబేస్‌తో పోల్చుతుంది. పోలిక 95 శాతం కంటే ఎక్కువగా ఉంటే వెంటనే అలర్ట్‌ ఇస్తుంది. ఈ విధమైన టెక్నాలజీ రైల్వే స్టేషన్లలో నేర నియంత్రణకు శక్తివంతమైన సాధనంగా మారనుంది. త్వరలోనే సికింద్రాబాద్ స్టేషన్‌లోనూ ఇదే ఆధునిక వ్యవస్థను ఏర్పాటు చేయాలని దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు. నిర్భయ ఫండ్‌ కింద రూ.4.8 కోట్లతో ప్రాజెక్టు అమలు చేయనున్నారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

AI Security CCTV Cameras charlapalli railway station crime prevention Face Recognition Latest News in Telugu Railway Safety South Central Railway Telangana news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.