చర్లపల్లి(Cherlapalli) రైల్వే టెర్మినల్ ఇప్పుడు అత్యాధునిక భద్రతా వ్యవస్థలకు నిలయంగా మారింది. ప్రయాణికుల రక్షణను బలోపేతం చేయడం, అనుమానితుల కదలికలను పర్యవేక్షించడం, అక్రమ కార్యకలాపాలను(Face Recognition Cameras) అరికట్టడం కోసం స్టేషన్‌లో ఫేస్ రికగ్నిషన్ (ఎఫ్.ఆర్) టెక్నాలజీతో కూడిన కెమెరాలను ఏర్పాటు చేశారు. అనుమానితులు స్టేషన్ పరిధిలో ప్రవేశించిన వెంటనే వారి వివరాలు గుర్తించే ఈ వ్యవస్థ రైల్వే భద్రతా ప్రమాణాలను మరింతగా పెంచనుంది.
టెర్మినల్‌లో మొత్తం 250 సీసీటీవీలు ఉండగా, వాటిలో 15 అత్యాధునిక ఎఫ్.ఆర్ కెమెరాలు ఉన్నాయి. ప్రవేశ ద్వారాలు, టికెట్ కౌంటర్లు, ప్లాట్‌ఫార్ములు, విశ్రాంతి గదులు, ఏటీవీఎం కేంద్రాలు వంటి కీలక ప్రాంతాల్లో వీటిని అమర్చారు. స్టేషన్‌లో ఏర్పాటు చేసిన కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా ప్రతి కెమెరా నుండి వచ్చే వీడియోలను రియల్ టైమ్‌లో పరిశీలిస్తూ అనుమానితుల వివరాలను డేటాబేస్‌తో తక్షణమే పోల్చి గుర్తిస్తున్నారు.
Read also: తొలి టెస్ట్.. ఆస్ట్రేలియా ఘన విజయం

మృతదేహం కేసు విచారణలో ఎఫ్.ఆర్. టెక్నాలజీ కీలక పాత్ర
ఇటీవల గోనెసంచిలో మృతదేహం(Face Recognition Cameras) లభించిన ఘటనను ఛేదించడంలో ఈ ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్ కీలక పాత్ర పోషించింది. నిందితుడి ముఖాన్ని కేవలం కొన్ని సెకన్లలో స్కాన్ చేసి, డేటాబేస్‌తో మ్యాచ్ చేసి పోలీసులకు సందేశం పంపడంతో అతడిని గుర్తించడం సాధ్యమైంది. దీంతో చర్లపల్లి స్టేషన్‌లో ఈ టెక్నాలజీ భద్రతా వ్యవస్థకు గట్టి బలం అయ్యింది. ఈ ఎఫ్.ఆర్. సిస్టమ్ ఏఐ ఆధారంగా 3–5 సెకన్లలో వ్యక్తి ముఖ లక్షణాలను విశ్లేషించి, డేటాబేస్‌తో పోల్చుతుంది. పోలిక 95 శాతం కంటే ఎక్కువగా ఉంటే వెంటనే అలర్ట్ ఇస్తుంది. ఈ విధమైన టెక్నాలజీ రైల్వే స్టేషన్లలో నేర నియంత్రణకు శక్తివంతమైన సాధనంగా మారనుంది. త్వరలోనే సికింద్రాబాద్ స్టేషన్‌లోనూ ఇదే ఆధునిక వ్యవస్థను ఏర్పాటు చేయాలని దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు. నిర్భయ ఫండ్ కింద రూ.4.8 కోట్లతో ప్రాజెక్టు అమలు చేయనున్నారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: