📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Latest News: FASTAG: ఫాస్టాగ్ నిబంధనల్లో మార్పు.. 

Author Icon By Aanusha
Updated: October 4, 2025 • 9:40 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఫాస్టాగ్ (FASTAG) వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం పెద్ద శుభవార్తను ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఉన్న టోల్ గేట్ల వద్ద తరచూ ఎదురయ్యే సమస్యలకు పరిష్కారంగా కొత్త నియమాలను అమలు చేయాలని నిర్ణయించింది. ఈ కొత్త నిబంధనలు నవంబర్ 15వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. రహదారి ప్రయాణికులకు, ముఖ్యంగా తరచూ టోల్ గేట్లు దాటే డ్రైవర్లు, ట్రక్ డ్రైవర్లు, కార్ యజమానులకు ఈ నిర్ణయం ఊరట కలిగించనుంది.

Qr Code: నేషనల్ హైవేలకు క్యూఆర్ కోడ్లు

చెల్లని ఫాస్టాగ్‌తో టోల్ గేట్ దాటే వాహనదారులకు పెద్ద ఊరట లభించనుంది. ముఖ్యంగా ఏదైనా వాహనానికి ఫాస్టాగ్ లేకపోయినా లేక అది చెల్లకపోయినా, పని చేయకపోయినా.. సాధారణ టోల్ రుసుము కంటే కేవలం 1.25 రెట్లు మాత్రమే అదనంగా చెల్లించి టోల్ గేట్ (Toll gate) దాటవచ్చు.

అయితే ఈ మొత్తాన్ని యూపీఐ (UPI) ద్వారా చెల్లించేందుకు అనుమతి ఉంటుంది.ప్రస్తుతం.. చెల్లుబాటు అయ్యే ఫాస్టాగ్ లేని వాహనదారులు సాధారణంగా ఉండే టోల్ ఛార్జీ కంటే రెట్టింపు జరిమానాను నగదు రూపంలో చెల్లించాల్సి వస్తోంది.

ఈ కొత్త నిర్ణయం ద్వారా ఆ భారీ జరిమానా

ఈ కొత్త నిర్ణయం ద్వారా ఆ భారీ జరిమానా భారం నుంచి వాహనదారులకు విముక్తి లభిస్తుందని దీపక్ దాష్ నివేదించారు. ఉదాహరణకు ఫాస్టాగ్ ఉన్న వారు రూ.100 చెల్లిస్తే.. ఫాస్టాగ్ లేని వారు నగదు రూపంలో రూ.200 చెల్లించాలి.

కానీ యూపీఐ (UPI) ద్వారా చెల్లిస్తే కేవలం రూ.125 చెల్లిస్తే సరిపోతుందని సర్కారు స్పష్టం చేసింది.ఫాస్టాగ్‌కు సంబంధించి ప్రభుత్వం తీసుకున్న మరో ముఖ్యమైన నిర్ణయం టోల్ వసూలు సంస్థలకు బాధ్యతను పెంచేలా ఉంది. ఒకవేళ మీ వాహనానికి చెల్లుబాటు అయ్యే, పని చేసే ఫాస్టాగ్ ఉన్నప్పటికీ..

FASTAG

లోపాలు లేకుండా చూసేలా వారిపై బాధ్యత

టోల్ ప్లాజా వద్ద ఉన్న ఎలక్ట్రానిక్ టోల్ వసూలు (Electronic toll collection) మౌలిక సదుపాయాలు పని చేయకపోయినా, సాంకేతిక లోపం కారణంగా టోల్ వసూలు చేయడంలో విఫలమైనా.. ఆ వాహనాన్ని ఎటువంటి చెల్లింపు లేకుండానే టోల్ ప్లాజాను దాటడానికి అనుమతిస్తారు.ప్రస్తుతం దేశవ్యాప్తంగా టోల్ వసూళ్లలో దాదాపు 98 శాతం ఫాస్టాగ్ ద్వారానే జరుగుతున్నాయి.

ఈ నేపథ్యంలోనే టోల్ వసూలు చేసే ఏజెన్సీలు ఎలక్ట్రానిక్ వసూలు వ్యవస్థను నాణ్యతతో నిర్వహించేలా, లోపాలు లేకుండా చూసేలా వారిపై బాధ్యత పెంచేందుకు ఈ చర్యలు తీసుకున్నారు. టోల్ వసూలు వ్యవస్థలో లోపం ఉంటే.. ఆ భారాన్ని ప్రజలు మోయకుండా.. ఆయా ఏజెన్సీలే బాధ్యత వహించేలా ఈ కొత్త నియమం పనిచేస్తుంది.

ప్రజల ఆర్థిక భారం గణనీయంగా తగ్గుతుంది

ఫాస్టాగ్ లేని లేదా పని చేయని వారికి 1.25 రెట్లు మాత్రమే జరిమానా వసూలు చేయడం వలన ప్రజల ఆర్థిక భారం గణనీయంగా తగ్గుతుంది. ఇంతకుముందు చెల్లించిన రెట్టింపు జరిమానా మొత్తం వాహనదారులకు భారంగా ఉండేది. కొత్త నిబంధన ద్వారా టెక్నాలజీని ప్రోత్సహించడం, అదే సమయంలో సాధారణ ప్రయాణికులకు ఉపశమనం కల్పించడం లక్ష్యంగా పెట్టుకున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

Breaking News Digital India FASTag FASTag update highway toll indian government latest news new toll rules NHAI road transport Telugu News toll plaza upi payment

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.