📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Latest Telugu News: AP నిర్మలా సీతారామన్‌తో చంద్రబాబు భేటీ.. నిధులపై విజ్ఞప్తి

Author Icon By Vanipushpa
Updated: August 22, 2025 • 5:21 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు(CM Chandra Babu) తన ఢిల్లీ(Delhi) పర్యటనలో భాగంగా నేడు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌(Nirmala Sitaraman)తో సమావేశమయ్యారు. రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న కీలక ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు అదనంగా రూ.5,000 కోట్ల ఆర్థిక సహాయం అందించాలని ఆయన కేంద్ర మంత్రిని కోరారు. ఈ మేరకు ఆయన ఒక వినతి పత్రాన్ని సమర్పించారు. రాష్ట్రాల మూలధన పెట్టుబడుల కోసం కేంద్రం అందిస్తున్న ప్రత్యేక సహాయ పథకం (SASCI) కింద ఈ నిధులను కేటాయించాలని చంద్రబాబు తన వినతిపత్రంలో పేర్కొన్నారు. గతంలో ఇదే పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్‌కు రూ.2,010 కోట్లు మంజూరైన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో నిలిచిపోయిన ప్రాజెక్టులను తిరిగి ప్రారంభించి, అభివృద్ధి పనులను వేగవంతం చేయడానికి ఈ అదనపు నిధులు అత్యవసరమని ఆయన వివరించినట్లు తెలిసింది.

AP నిర్మలా సీతారామన్‌తో చంద్రబాబు భేటీ.. నిధులపై విజ్ఞప్తి

ముఖ్యమంత్రి విజ్ఞప్తిపై కేంద్ర మంత్రి సానుకూల స్పందన
ఈ ప్రత్యేక నిధులతో పాటు, రాష్ట్రంలో చేపట్టబోయే పలు ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు కూడా కేంద్ర ప్రభుత్వం ఆర్థికంగా అండగా నిలవాలని ముఖ్యమంత్రి అభ్యర్థించారు. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి కేంద్ర సహకారం ఎంతో కీలకమని ఆయన ఈ సందర్భంగా నొక్కిచెప్పారు. ముఖ్యమంత్రి విజ్ఞప్తిపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ఈ సమావేశంలో చంద్రబాబుతో పాటు కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, కేంద్ర సహాయమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎంపీలు మాగుంట శ్రీనివాసులురెడ్డి, లావు శ్రీకృష్ణదేవరాయలు కూడా పాల్గొన్నారు.


నిర్మలా సీతారామన్ వ్యక్తిగత జీవితం?

నిర్మల బిజెపి వైపు మొగ్గు చూపగా, ఆమె భర్త కాంగ్రెస్ కుటుంబానికి చెందినవాడు. వారు 1986 లో వివాహం చేసుకున్నారు మరియు గతంలో ది హిందూ మరియు మింట్‌లో పనిచేసిన ఒక కుమార్తె ఉంది. ప్రభాకర్ 2014 నుండి 2018 వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కమ్యూనికేషన్ సలహాదారుగా పనిచేశారు.

నిర్మలా సీతారామన్ ఆర్థిక మంత్రిగా ఎప్పుడు బాధ్యతలు చేపట్టారు?

సీతారామన్ మే 31, 2019 న ఆర్థిక మరియు కార్పొరేట్ వ్యవహారాల మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. రక్షణ మంత్రిత్వ శాఖలో తన పాత్రను ప్రతిబింబిస్తూ, గాంధీ తర్వాత ఆర్థిక మంత్రిగా పనిచేసిన రెండవ మహిళ – మరియు పూర్తి సమయం ఆ పదవిని నిర్వహించిన మొదటి మహిళ ఆమె.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/telugu-news-china-pak-china-america-help-pakistan-india-helps-in-high-tension/national/534574/

Andhra Pradesh Funds AP Politics Central Government Chandrababu Naidu Latest News Breaking News Nirmala Sitharaman TDP News Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.