కొత్త సంవత్సరం ప్రారంభంతోనే దేశవ్యాప్తంగా పలు ఆర్థిక, నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ఈ మార్పుల ప్రభావం సామాన్య వినియోగదారులపై పడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా గృహోపకరణాల విభాగంలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి.బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ (బీఈఈ) కొత్త నిబంధనల ప్రకారం ఏసీ (AC Price)లు, రిఫ్రిజిరేటర్ల వంటి ఉపకరణాల ధరలు 5 శాతం వరకు పెరిగే అవకాశం ఉంది.
Read Also: Online Services: కొత్త ఏడాది నుంచి రేషన్ కార్డుల నిబంధనల్లో కీలక మార్పులు
అదనపు ఖర్చు
కఠినతరం చేసిన నిబంధనల వల్ల, ప్రస్తుతం 5 స్టార్ రేటింగ్ ఉన్న ఉపకరణాలు 4 స్టార్‌గా, 4 స్టార్ ఉపకరణాలు 3 స్టార్‌గా మారనున్నాయి. రేటింగ్ పెంచడానికి అదనపు ఖర్చుతో వీటిని మరింత సమర్థవంతంగా తయారు చేయాల్సి ఉంటుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: