📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Chaitanya Baghel: లిక్కర్ స్కామ్ కేసులో మాజీ సీఎం కొడుకు చైతన్య బాఘేల్‌ అరెస్ట్

Author Icon By Sudha
Updated: July 18, 2025 • 4:33 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఛత్తీస్‌గఢ్‌లో మాజీ సీఎం భూపేశ్ బాఘేల్ కుమారుడు చైతన్య బాఘేల్‌ (Chaitanya Baghel) ఈడీ (ED) అరెస్టు (arrest) చేసింది.ఈ ఘటన చైతన్య పుట్టినరోజున జరగడంతో ఇది రాజకీయంగా మరింత ఉద్రేకానికి దారితీసింది. లిక్కర్ స్కామ్ కేసులో ఆయన కొడుకుని అరెస్ట్ చేసింది. దీనిపై భూపేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రూ.2100 కోట్ల లిక్కర్ స్కామ్ తో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసుకు సంబంధించి అరెస్టు చేసింది. మనీలాండరింగ్ నిరోధక చట్టంలోని సెక్షన్ 19 కింద ఆయనను భిలాయ్‌లోని కుటుంబ సభ్యుల నివాసం నుండి అదుపులోకి తీసుకున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. సోదాల సమయంలో చైతన్య (Chaitanya Baghel) సహకరించలేదని ఈడీ ఆరోపించింది. ఈ అరెస్టుతో ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీలో గందరగోళం చెలరేగింది. ప్రతిపక్షాల కేంద్రం తప్పుడు అక్రమ కేసులు పెడుతుందంటూ కాంగ్రెస్ సభ్యులు నిరసనకు దిగారు. కాంగ్రెస్ నిరసనలతో అసెంబ్లీ వాయిదా పడింది. ఇదే కేసులో మాజీ ఎక్సైజ్ మంత్రి కవాసి లఖ్మాను జనవరిలో అరెస్టు చేశారు. లిక్కర్ సిండికేట్ నిర్వహిస్తున్న ఈ కుంభకోణంలో భాగంగా లఖ్మా ప్రతి నెలా పెద్ద మొత్తంలో నగదు అందుకున్నట్లు దర్యాప్తు సంస్థ ఆరోపిస్తోంది.

Chaitanya Baghel: లిక్కర్ స్కామ్ కేసులో మాజీ సీఎం కొడుకు చైతన్య బాఘేల్‌ అరెస్ట్

కుట్ర రాజకీయాలు

రాజకీయ కక్షలో భాగంగానే తన కొడుకును అరెస్ట్ చేసినట్లు భూపేశ్ బాఘేల్ ఆరోపించారు. బర్త్ డే రోజే తన కొడుకును అరెస్ట్ చేయడం ప్రతీకార రాజకీయాల్లో భాగమని మండిపడ్డారు. కుట్ర రాజకీయాలకు తాము తలవంచబోయేది లేదని చెప్పారు. ‘‘బీహార్ వంటి రాష్ట్రాల్లో ఓవైపు ఓటర్లను తొలగిస్తున్నారు. మరోవైపు ప్రతిపక్ష పార్టీల నేతలపై ఈడీ, సీబీఐలతో దాడులు చేయిస్తున్నారు. మాకు న్యాయవ్యవస్థపై నమ్మకం ఉందని చెప్పారు. మేం న్యాయస్థానంలో తేల్చుకుంటాం’’ బాఘేల్ అన్నారు. ఈ సందర్భంగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. తమ్నార్ లో అదానీ కోసం చెట్లను నరికే అంశాన్ని తాము అసెంబ్లీలో లేవనెత్తడానికి సిద్ధమైన తరుణంలో పోలీసులు తన కొడుకును అరెస్ట్ చేశారని బాఘేల్ అన్నారు.

లిక్కర్ కుంభకోణం

కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 2019 -2022 మధ్య లిక్కర్ కుంభకోణం జరిగిందని ఈడీ ఆరోపిస్తోంది. ఈ కుంభకోణం ద్వారా వచ్చిన డబ్బు చైతన్య బాఘేల్‌కు అందినట్లు అభియోగాలు మోపింది. ప్రభుత్వ చర్యల వల్ల లిక్కర్ సిండికేట్‌కు రూ.2100 కోట్లకు పైగా అక్రమ లాభాలు వచ్చాయని ఈడీ ఆరోపిస్తోంది. ఇప్పటికే ఈ కేసులో పలువురు అధికారులు, మాజీ ఐఏఎస్‌లు అరెస్ట్ అయ్యారు. ఇప్పటివరకు రూ.205కోట్ల ఆస్తులను జప్తు చేశారు. చైతన్య బాఘేల్‌(Chaitanya Baghel) ను ఈడీ గతంలోనూ పలుసార్లు విచారించింది. ఈ సారి అరెస్ట్ చేయడం గమనార్హం.

బఘెల్ చరిత్ర?

13వ శతాబ్దం ADలో స్థాపించబడిన మధ్యప్రదేశ్‌లోని బాఘేల్‌ఖండ్ ప్రాంతాన్ని బాఘేల్ రాజవంశం పాలించింది. బాఘేల్ రాజవంశాన్ని మహారాజా వ్యాఘ్రదేవ్ 1234 ADలో స్థాపించారు . బాఘేల్ మొదట గుజరాత్‌లోని అన్హిల్వారాకు చెందిన సోలంకి రాజవంశానికి చెందిన చాళుక్యులు.

యుపిలో బాఘెల్ ఏ వర్గం?

జూలై 3, 2015న, బాగెల్ బిజెపి ఓబిసి మోర్చా (భారతీయ జనతా పార్టీ యొక్క “ఇతర వెనుకబడిన తరగతి” విభాగం) అధ్యక్షుడయ్యాడు. 2017లో, బాగెల్ భారతీయ జనతా పార్టీ (బిజెపి) తరపున ఉత్తరప్రదేశ్ శాసనసభ సభ్యుడయ్యాడు. 2019లో, అతను బిజెపి టిక్కెట్‌పై ఆగ్రా స్థానం నుండి లోక్‌సభకు ఎన్నికయ్యాడు.

Read hindi news: hindi.vaartha.com

Read Also: Siddaramaiah: క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రికి క్ష‌మాప‌ణ చెప్పిన

Bhupesh Baghel Bhupesh Baghel Son Breaking News Chaitanya Baghel ED Arrest latest news liquor scam Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.