📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? బంగారం ధర షాక్! ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? బంగారం ధర షాక్!

Employees: EPFO వేతన పరిమితిని రూ. 25 వేలకు పెంచే యోచనలో కేంద్రం

Author Icon By Vanipushpa
Updated: January 29, 2026 • 1:52 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

దేశంలో ఉద్యోగుల సామాజిక భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతం Employees Provident Fund Organisation (EPFO) కింద అమల్లో ఉన్న వేతన పరిమితిని నెలకు రూ. 15వేల నుంచి రూ.25 వేలకు పెంచే ప్రతిపాదనపై చర్చలు జరుపుతోంది. ఇది అమల్లోకి వస్తే ఇప్పటివరకు EPFO పరిధి బయట ఉన్న లక్షలాది ఉద్యోగులు సామాజిక భద్రత పరిధిలోకి రావడానికి అవకాశం ఉంటుంది.
EPFO వేతన పరిమితి అంటే.. ఎంత జీతం వరకు తప్పనిసరిగా ఉద్యోగి, యజమాని ప్రావిడెంట్ ఫండ్ (PF).. అలాగే Employees Pension Scheme (EPS) కింద కంట్రిబ్యూషన్ చెల్లించాలి అనే గరిష్ట హద్దుగా చెప్పవచ్చు. ప్రస్తుతం ఇది రూ. 15 వేలుగా ఉంది. అంటే నెలకు రూ. 15 వేల కంటే ఎక్కువ వేతనం పొందుతున్న ఉద్యోగులు తప్పనిసరిగా EPFO పరిధిలోకి రావాల్సిన అవసరం లేదు. ఫలితంగా.. ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న అనేక మంది ఉద్యోగులు పెన్షన్, దీర్ఘకాలిక పొదుపు లాభాలను పూర్తిగా పొందలేకపోతున్నారు.

Read Also: Pakistan: ఇమ్రాన్ ఖాన్ కంటి వ్యాధిపై వైద్యుల పరీక్షలు

Employees: EPFO వేతన పరిమితిని రూ. 25 వేలకు పెంచే యోచనలో కేంద్రం

ఏప్రిల్ 1 నుంచి కొత్త నిబంధన అమలు

ఈ పరిస్థితిని మార్చాలనే ఉద్దేశంతో ప్రభుత్వం వేతన పరిమితిని రూ. 25 వేల వరకు పెంచాలని ఆలోచిస్తోంది. ఈ ప్రతిపాదన త్వరలోనే EPFO యొక్క అత్యున్నత నిర్ణయాధికార సంస్థ అయిన (CBT) సమావేశంలో చర్చకు వచ్చే అవకాశముంది. అవసరమైన ఆమోదాలు లభిస్తే.. ఈ కొత్త నిబంధనను ఏప్రిల్ 1 నుంచి అమలు చేయవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ మార్పుకు ప్రధాన కారణాల్లో ఒకటి సుప్రీంకోర్టు సూచనలు అని చెప్పవచ్చు. ప్రస్తుతం అమల్లో ఉన్న రూ. 15 వేల వేతన పరిమితి 2014లో నిర్ణయించారు. అప్పటి నుంచి దేశంలో వేతనాలు, జీవన వ్యయం, ఉద్యోగ స్వరూపం గణనీయంగా మారాయి. అయినప్పటికీ EPFO నిబంధనల్లో మార్పులు జరగకపోవడంతో.. వాస్తవ పరిస్థితులకు ఇవి సరిపడట్లేదని కోర్టు అభిప్రాయపడింది. అందుకే వేతన పరిమితిని పెంచాలని ప్రభుత్వం పై ఒత్తిడి పెరిగింది. ఈ మార్పు అమలైతే ఉద్యోగులపై పలు విధాలుగా ప్రభావం పడుతుంది. మొదటిగా EPFO పరిధిలోకి వచ్చే ఉద్యోగుల సంఖ్య భారీగా పెరుగుతుంది. దీనివల్ల ప్రావిడెంట్ ఫండ్ నిధుల పరిమాణం మరింత బలపడుతుంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Employee Provident Fund EPF updates EPFO contribution EPFO wage limit India labour reforms retirement benefits India salary limit increase Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.