Central Railway: హోలీ పండుగను పురస్కరించుకుని స్వగ్రామాలకు వెళ్లే ప్రయాణికుల కోసం భారతీయ రైల్వే భారీ ఊరటనిచ్చింది. పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించింది.
ఈ నెల 25 నుంచి మార్చి 18 వరకు వివిధ రైల్వే జోన్‌ల పరిధిలో మొత్తం 1,244 ప్రత్యేక ట్రిప్పులు నడపాలని అధికారులు నిర్ణయించారు. సాధారణ రైళ్లలో ఎదురయ్యే రద్దీని తగ్గించడానికి ప్రయాణికులకు సులభంగా అందుబాటులో ఉండేలా ఈ చర్యలు తీసుకున్నట్లు రైల్వే శాఖ (Railway Department) ప్రకటించింది. ఉత్తర, తూర్పు రాష్ట్రాల వైపు వెళ్లే ప్రయాణికులకు ఈ నిర్ణయం ఎంతో ఊరటనివ్వనుంది.
Read Also: Older generation : వృద్ధతరం భారం కాదు.. హారమే!
16 ప్రత్యేక రైళ్లు
తెలుగు రాష్ట్రాల మీదుగా ప్రయాణించే వారి కోసం దక్షిణ మధ్య రైల్వే 16 ప్రత్యేక రైళ్లను కేటాయించింది. సికింద్రాబాద్, చర్లపల్లి, తిరుపతి వంటి ప్రధాన స్టేషన్లతో పాటు చంద్రపూర్ నుంచి కూడా ఈ సర్వీసులు అందుబాటులో ఉండనున్నాయి. ప్రధానంగా ఉత్తర, తూర్పు రాష్ట్రాల వైపు వెళ్లే ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉన్న రూట్లలో ఈ రైళ్లను నడపనున్నారు. టికెట్ బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమైనట్లు రైల్వే అధికారులు తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: