Central Railway: హోలీ పండుగ రద్దీకి ప్రత్యేక రైళ్లు

Read Time:  1 min
Central Railway: హోలీ పండుగ రద్దీకి ప్రత్యేక రైళ్లు
FONT SIZE
GET APP

Central Railway: హోలీ పండుగను పురస్కరించుకుని స్వగ్రామాలకు వెళ్లే ప్రయాణికుల కోసం భారతీయ రైల్వే భారీ ఊరటనిచ్చింది. పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించింది.

ఈ నెల 25 నుంచి మార్చి 18 వరకు వివిధ రైల్వే జోన్‌ల పరిధిలో మొత్తం 1,244 ప్రత్యేక ట్రిప్పులు నడపాలని అధికారులు నిర్ణయించారు. సాధారణ రైళ్లలో ఎదురయ్యే రద్దీని తగ్గించడానికి ప్రయాణికులకు సులభంగా అందుబాటులో ఉండేలా ఈ చర్యలు తీసుకున్నట్లు రైల్వే శాఖ (Railway Department) ప్రకటించింది. ఉత్తర, తూర్పు రాష్ట్రాల వైపు వెళ్లే ప్రయాణికులకు ఈ నిర్ణయం ఎంతో ఊరటనివ్వనుంది.

Read Also: Older generation : వృద్ధతరం భారం కాదు.. హారమే!

Central Railway: హోలీ పండుగ రద్దీకి ప్రత్యేక రైళ్లు
Central Railway: Special trains for Holi festival rush

16 ప్రత్యేక రైళ్లు

తెలుగు రాష్ట్రాల మీదుగా ప్రయాణించే వారి కోసం దక్షిణ మధ్య రైల్వే 16 ప్రత్యేక రైళ్లను కేటాయించింది. సికింద్రాబాద్‌, చర్లపల్లి, తిరుపతి వంటి ప్రధాన స్టేషన్లతో పాటు చంద్రపూర్‌ నుంచి కూడా ఈ సర్వీసులు అందుబాటులో ఉండనున్నాయి. ప్రధానంగా ఉత్తర, తూర్పు రాష్ట్రాల వైపు వెళ్లే ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉన్న రూట్లలో ఈ రైళ్లను నడపనున్నారు. టికెట్ బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమైనట్లు రైల్వే అధికారులు తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Saritha

రచయిత గురించి

Saritha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.