📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Central Govt: ఇకపై కేరళ కాదు.. ‘కేరళమ్‌’

Author Icon By Saritha
Updated: February 24, 2026 • 3:24 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Central Govt: దక్షిణాది రాష్ట్రం కేరళ (Kerala) తన అసలు పేరును తిరిగి పొందే దిశగా అడుగులు వేస్తోంది. కేరళ అనే పేరును అధికారికంగా కేరళమ్‌గా మారుస్తూ రాష్ట్ర అసెంబ్లీ పంపిన ప్రతిపాదనకు కేంద్ర క్యాబినెట్ త్వరలోనే ఆమోదం తెలిపే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ అంశంపై ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం.

మలయాళ భాషలో ఈ రాష్ట్రాన్ని పూర్వం నుంచే కేరళమ్‌ అని పిలుస్తారు. అయితే 1956లో భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు సమయంలో రాజ్యాంగంలోని మొదటి షెడ్యూల్‌లో దీనిని కేరళగా నమోదు చేశారు. బ్రిటీష్ పాలకులు తమ ఉచ్చారణ సౌలభ్యం కోసం మార్చిన ఈ పేరునే ఇప్పటికీ కొనసాగిస్తున్నారు.

Read also: AISummit 2026: నిరసనకారులకు బెయిల్ నిరాకరించిన ఢిల్లీ హైకోర్టు

Central Govt: No more Kerala.. ‘Kerala’

రాజకీయ ఏకాభిప్రాయం

రాష్ట్ర పేరు మార్పు విషయంలో కేరళలో అరుదైన రాజకీయ ఏకాభిప్రాయం కనిపిస్తోంది. ముఖ్యమంత్రి పినరయి విజయన్ దీనిపై మాట్లాడుతూ.. “మా రాష్ట్రం పేరు మలయాళంలో కేరళమ్‌ మాత్రమే. ఇతర భాషల్లో మాత్రం కేరళగా పిలుస్తున్నారు. బ్రిటీషర్లు చేసిన ఈ మార్పును సరిదిద్ది, మా సంస్కృతికి అనుగుణంగా పేరు మార్చాలని కోరుతున్నాం” అని గతంలోనే అసెంబ్లీలో స్పష్టం చేశారు.

2023లో కేరళ అసెంబ్లీ ఈ మేరకు ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం రాష్ట్రం పేరును మార్చడానికి బిల్లును ప్రవేశ పెట్టాలి. రాజ్యాంగంలోని మొదటి షెడ్యూల్‌లో కేరళ స్థానంలో కేరళమ్‌ను చేర్చాలి. కేంద్ర ప్రభుత్వం గనుక ఆమోదం తెలిపితే.. ఇకపై ప్రభుత్వ రికార్డులు, గెజిట్లు, అంతర్జాతీయ వేదికలపై రాష్ట్రం పేరు అధికారికంగా కేరళమ్‌‌గా దర్శనమివ్వనుంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

Central Cabinet Decisions Kerala name change Keralam State Latest News in Telugu Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.