Central Govt: హోలీకి ముందే ఉద్యోగులకు శుభవార్త

Read Time:  1 min
Central Govt
Central Govt
FONT SIZE
GET APP

కేంద్ర ప్రభుత్వ(Central Govt) ఉద్యోగులు, పెన్షనర్లకు హోలీ పండుగకు ముందే డియర్‌నెస్ అలవెన్స్ (DA) మరియు డియర్‌నెస్ రిలీఫ్ (DR) పెంపుపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఈసారి డీఏను కేవలం 2 శాతం పెంచే దిశగా సంకేతాలు కనిపిస్తున్నాయి.

Read Also: Railway News: హోలీ పండుగకు రైల్వే శుభవార్త

Central Govt

డీఏ 60 శాతానికి చేరే అవకాశం

ప్రస్తుతం 58 శాతంగా ఉన్న డియర్‌నెస్ అలవెన్స్ పెంపుతో 60 శాతానికి చేరనుందని అంచనా వేస్తున్నారు. దీని వల్ల ఉద్యోగుల నెలవారీ ఆదాయంలో స్వల్పమైనా ఊరట లభించనుంది. డీఏ పెంపు వల్ల బేసిక్ పే ఆధారంగా జీతాల్లో పెరుగుదల(Central Govt) ఉంటుంది. రూ.20 వేల బేసిక్ పే ఉన్న ఉద్యోగికి నెలకు సుమారు రూ.400 అదనంగా లభించనుంది. అదే రూ.50 వేల బేసిక్ పే ఉన్నవారికి దాదాపు రూ.1,000 వరకు, రూ.లక్ష బేసిక్ ఉన్న ఉద్యోగులకు నెలకు సుమారు రూ.2,000 వరకు పెరుగుదల ఉండే అవకాశం ఉంది. ఈ పెంపు పెన్షనర్లకూ డీఆర్ రూపంలో వర్తించనుంది.

డీఏ పెంపు ఎప్పటి నుంచి అమలు?

కేంద్ర ప్రభుత్వం సాధారణంగా ఏడాదికి రెండుసార్లు డియర్‌నెస్ అలవెన్స్‌ను సవరిస్తుంది. జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చే డీఏ పెంపును మార్చి నెలలో అధికారికంగా ప్రకటించే సంప్రదాయం ఉంది. ఈసారి కూడా అదే విధానంలో హోలీ పండుగకు ముందు ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయని అధికారులు భావిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Pooja

రచయిత గురించి

Pooja

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.