📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

DA Hike: కేంద్ర ఉద్యోగులకు గుడ్ న్యూస్: హోలీ కానుకగా 2% డీఏ పెంపు..

Author Icon By Tejaswini Y
Updated: February 9, 2026 • 3:39 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

DA Hike: ఈ ఏడాది హోలీ పండుగ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్ల పాలిట సరికొత్త వెలుగులు నింపనుంది. సుమారు 1.15 కోట్ల మంది లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరుస్తూ, కరువు భత్యాన్ని పెంచేందుకు మోదీ సర్కార్ రంగం సిద్ధం చేసింది. తాజా గణాంకాల ప్రకారం డీఏ 2 శాతం పెరిగి, మొత్తంగా 60 శాతానికి చేరుకోనుంది.

Read Also: Chandrababu Naidu: ప్రపంచంలోనే ప్రత్యేక నగరంగా అమరావతి

DA Hike: Good news for central employees: 2% DA hike as a Holi gift..

జీతాల్లో భారీ మార్పు.. ఎప్పటి నుంచి అమలు?

ప్రస్తుతం కేంద్ర ఉద్యోగులకు 58 శాతంగా ఉన్న డీఏ, తాజా పెంపుతో 60 శాతానికి చేరుతుంది. కార్మిక శాఖ విడుదల చేసిన డిసెంబర్ 2025 నాటి ‘ఆల్ ఇండియా కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్’ (AICPI) డేటా ప్రకారం.. ఈ పెరుగుదల ఖాయమైంది. మార్చి మొదటి వారంలో జరిగే కేంద్ర క్యాబినెట్ సమావేశంలో దీనిపై అధికారిక ముద్ర పడనుంది.

ముఖ్యంగా ఈ పెంపు జనవరి 1, 2026 నుండి అమలులోకి వస్తుంది. అంటే, మార్చి నెల జీతంతో పాటు జనవరి, ఫిబ్రవరి నెలల బకాయిలు (Arrears) కూడా ఉద్యోగుల ఖాతాల్లో జమ కానున్నాయి.

బేసిక్ జీతంపై లెక్కలివే..

ఒక ఉద్యోగి కనీస వేతనం రూ. 50,000 అనుకుంటే, ఇప్పటివరకు 58 శాతం డీఏ కింద రూ. 29,000 పొందుతున్నారు. ఇప్పుడు అది 60 శాతానికి చేరడంతో ఆ మొత్తం రూ. 30,000 అవుతుంది. అంటే నెలకు రూ. 1,000 అదనంగా లబ్ధి చేకూరుతుంది. అరియర్స్ కూడా తోడవ్వడంతో హోలీ లోపే ఉద్యోగుల చేతికి భారీ నగదు అందనుంది.

8వ వేతన సంఘంపై ఆశలు

7వ వేతన సంఘం గడువు ముగిసిన నేపథ్యంలో, ఈ డీఏ పెంపు ప్రాధాన్యత సంతరించుకుంది. త్వరలో ఏర్పాటు కానున్న 8వ వేతన సంఘం ద్వారా ఈ డీఏను బేసిక్ జీతంలో విలీనం చేసే అవకాశం ఉంది. ఇది భవిష్యత్తులో ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్ మరియు ఫిట్ మెంట్ ఫ్యాక్టర్ లెక్కింపులో కీలక మార్పులకు దారితీస్తుంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

7th Pay Commission Updates 8th Pay Commission News Central Govt Employees DA Hike 2026 DA Arrears March 2026 Holi Gift for Govt Employees

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.