📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Employees : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. 30 రోజుల సెలవులు!

Author Icon By Sudha
Updated: July 25, 2025 • 4:46 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం నుండి మరో శుభవార్త వెలువడింది. ఉద్యోగుల (Employees)వృద్ధ తల్లిదండ్రుల సంరక్షణతో పాటు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం, వార్షికంగా 30 రోజుల అదనపు సెలవు (Earned Leave) పొందే అవకాశం కల్పించనున్నట్లు కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ రాజ్యసభలో ప్రకటించారు. ఈ సెలవులు ఉద్యోగులు (Employees)తమ వ్యక్తిగత అవసరాల కోసం ఉపయోగించుకోవచ్చని, ప్రత్యేకించి కుటుంబ సంరక్షణ, ఆరోగ్య సంబంధిత కారణాలు, లేదా వ్యక్తిగత విశ్రాంతి కోసం తీసుకోవచ్చని ఆయన వివరించారు. ఇందులో 20 రోజుల హాఫ్ పే లీవ్, ఎనిమిది రోజుల క్యాజువల్ లీవ్, 2 రోజుల పరిమిత సెలవులు ఉన్నాయి. రాజ్యసభలో ఎంపీ సుమిత్రా బాల్మిక్ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. కేంద్ర సహాయమంత్రి జితేంద్ర సింగ్ సమాధానం ఇచ్చారు. సర్వీస్‌ రూల్స్‌ ప్రకారం.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు 30 రోజులు సెలవు తీసుకునేందుకు అర్హులని.. ఈ సెలవులను వృద్ధ తల్లిదండ్రులను చూసుకునేందుకు, ఇతర వ్యక్తిగత అవసరాల కోసం ఉపయోగించవచ్చన్నారు.

Employees : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. 30 రోజుల సెలవులు!

సెంట్రల్ సివిల్ సర్వీసెస్ నిబంధనలు, 1972 ప్రకారం.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగికి 30 రోజుల సెలవుల్లో 20 రోజులు హాఫ్‌ పే లీవ్స్‌, 8 రోజుల క్యాజువల్ లీవ్స్‌, 2 రోజుల పరిమిత సెలవులతో పాటు ఇతర అర్హత గల సెలవులు ఉంటాయి. ఆయా సెలవులను ఉద్యోగులు (Employees)తమ వృద్ధ తల్లిదండ్రులను చూసుకోవడం తదితర వ్యక్తిగత కారణాల కోసం తీసుకోవచ్చని కేంద్రమంత్రి తెలిపారు. సదరు ఉద్యోగి సెలవులు ఎందుకు పెట్టారని అడిగితే వృద్ధులైన తల్లిదండ్రులను చూసుకునేందుకని స్పష్టంగా పేర్కొనవచ్చు. అయితే, ఇవేమీ కొత్తగా ఇచ్చే సెలవులేమి కాకపోయినా.. వృద్ధ తల్లిదండ్రులను చూసుకునేందుకు సైతం సెలవులు తీసుకునే అవకాశం ఉందని చెప్పడం కొత్త విషయం.

ఉద్యోగుల ప్రాముఖ్యత?

వారు ఉత్పత్తిని తయారు చేసే లేదా కస్టమర్లకు సేవను అందించే వ్యక్తులు. ఉద్యోగులు వ్యాపార ఫలితంపై భారీ ప్రభావాన్ని చూపుతారు. ఉద్యోగులు వ్యాపారం బాగా జరగాలనే ఆసక్తిని కలిగి ఉంటారు, తద్వారా వారు ఉద్యోగ భద్రత పొందవచ్చు.

ఉద్యోగ భద్రత ఎందుకు ముఖ్యం?

ఉద్యోగ భద్రత పెరగడం వల్ల ఉద్యోగులు తమ పాత్రల్లో మరింత ఉత్పాదకత కలిగి ఉంటారు . తక్కువ భద్రత ఉన్న ఉద్యోగాలు ఉద్యోగులు మరింత పరధ్యానంలో లేదా ఆందోళన చెందుతున్నట్లు భావిస్తాయి, కాబట్టి ఈ భద్రత ఎక్కువ దృష్టి మరియు దృఢ సంకల్పానికి వీలు కల్పిస్తుంది. వారు తమ పాత్రల్లో లేదా కంపెనీలో కెరీర్‌లో ఎదగాలని కోరుకుంటున్నందున భద్రత అనుభూతి కూడా ప్రేరణను అందిస్తుంది.

ఉద్యోగుల ప్రధాన విధులు ఏమిటి?

వారు నియమించబడిన పనిని వ్యక్తిగతంగా చేయడానికి. తమ పనిని జాగ్రత్తగా మరియు తీవ్రంగా చేయడానికి (కొన్ని సందర్భాల్లో, వారు తరచుగా పనికి ఆలస్యంగా వస్తే, లేదా వారు చాలా తరచుగా లేకుంటే లేదా సరైన కారణం లేకుండా ఉంటే వారిని తొలగించవచ్చు లేదా క్రమశిక్షణ విధించవచ్చు.) తమను తాము లేదా ఇతరులను ప్రమాదంలో పడకుండా ఉండటానికి.

Read hindi news: hindi.vaartha.com

Read Also: Jagdeep Dhankhar: ధన్‌ఖడ్‌కు విపక్షాల వీడ్కోలు విందు..దీనిపై

30 days leave Breaking News Central Government Employees earned leave government announcement jitendra singh latest news Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.