LPG Supply: గ్యాస్ కష్టాలకు చెక్: హోటళ్లు, రెస్టారెంట్లకు ఊరటనిస్తూ కేంద్రం కీలక నిర్ణయం

Read Time:  1 min
central-government-allocates-additional-20-percent-gas-to-states-west-asia-crisis
central-government-allocates-additional-20-percent-gas-to-states-west-asia-crisis
FONT SIZE
GET APP

LPG Supply: ఇరాన్, ఇజ్రాయెల్ మరియు అమెరికా మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల కారణంగా పశ్చిమాసియా నుంచి ఇంధన సరఫరా నిలిచిపోయింది. ఈ యుద్ధ ప్రభావం ప్రపంచ దేశాలతో పాటు భారత్‌పై కూడా తీవ్రంగా పడింది. ముఖ్యంగా దేశీయంగా గ్యాస్ సరఫరాలో అంతరాయం ఏర్పడటంతో, కేంద్ర ప్రభుత్వం గతంలో వాణిజ్య గ్యాస్ సిలిండర్లపై పరిమితులు విధించి గృహావసరాలకు ప్రాధాన్యతనిచ్చింది. దీనివల్ల హోటల్, ఆతిథ్య రంగాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాయి.

Read Also: Mamata banerjee comments: మోదీయే అతిపెద్ద చొరబాటుదారు:బెనర్జీ సంచలన కౌంటర్!

రాష్ట్రాలకు 20 శాతం అదనపు గ్యాస్ కేటాయింపు

గ్యాస్ కొరతను అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు అదనంగా 20 శాతం గ్యాస్ వాటాను కేటాయిస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం మార్చి 23 నుంచి అమల్లోకి రానుంది. ఈ మేరకు కేంద్ర పెట్రోలియం సహజవాయువు శాఖ కార్యదర్శి డాక్టర్ నీరజ్ మిట్టల్ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారిక లేఖలు రాశారు.

సంక్షోభం నుంచి ఊరట: కోటా 50 శాతానికి పెంపు

తాజా పెంపుతో రాష్ట్రాలకు అందే గ్యాస్ కోటా, యుద్ధానికి ముందు ఉన్న స్థాయిలో 50 శాతానికి చేరుకుంటుందని నీరజ్ మిట్టల్ తన లేఖలో పేర్కొన్నారు. ఇది సామాన్య ప్రజలకు, వాణిజ్య రంగాలకు పెద్ద ఊరటనివ్వనుంది. అయితే, ఈ అదనపు గ్యాస్ వినియోగంలో కేంద్రం కొన్ని ఖచ్చితమైన ప్రాధాన్యతలను (Priorities) సూచించింది. కానీ, అదనంగా కేటాయించిన 20 శాతం గ్యాస్‌ను వినియోగంలో కొన్ని ఖచ్చితమైన ప్రాధాన్యతలను కేంద్రం స్పష్టం చేసింది.

central-government-allocates-additional-20-percent-gas-to-states-west-asia-crisis
central-government-allocates-additional-20-percent-gas-to-states-west-asia-crisis

వలస కార్మికులకు ఉద్దేశించిన 5 కిలోల ఎఫ్‌టిఎల్ సిలిండర్లను కచ్చితంగా సరఫరా చేయాలి

ముఖ్యంగా సామాన్యుల ఆహార అవసరాలకు లోటు లేకుండా ఉండేలా హోటళ్లు, రెస్టారెంట్లు, దాబాలు, ఇండస్ట్రియల్ క్యాంటీన్లు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించింది.అలాగే, ప్రభుత్వాలు లేదా స్థానిక సంస్థలు రాయితీతో నిర్వహించే క్యాంటీన్లు, కమ్యూనిటీ కిచెన్లు, వలస కార్మికులకు ఉద్దేశించిన 5 కిలోల ఎఫ్‌టిఎల్ సిలిండర్లను కచ్చితంగా సరఫరా చేయాలని పెట్రోలియం శాఖ కార్యదర్శి మిట్టల్ తన లేఖలో స్పష్టంగా తెలిపారు.

అప్పటివరకు అమలులో

ఈ అదనపు కోటా దుర్వినియోగం కాకుండా చూడాల్సిన బాధ్యత స్థానిక ప్రభుత్వాలదేనని తేల్చిచెప్పింది. బ్లాక్ మార్కెట్‌ సహా పక్కదారి పట్టకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని, అర్హులైనవారికి మాత్రమే ఇది అందేలా చూడాలని సూచించింది. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఈ కేటాయింపులు అమలులో ఉంటాయని పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా సరఫరా వ్యవస్థలు మెరుగు పడే వరకు ఈ ప్రాధాన్యత క్రమాన్ని పాటించాలని ఆదేశించింది.

తాజా నిర్ణయంతో ముఖ్యంగా వలస కార్మికులు, మధ్యతరగతి ప్రజలకు కొంత మేర ఉపశమనం లభించే అవకాశం ఉంది. గ్యాస్ కొరతతో పరిశ్రమలు, ఐటీ కంపెనీల్లో క్యాంటీన్లు మూసివేయగా.. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో హోటల్స్, రెస్టారెంట్‌లలో మెనూలు తగ్గించేశాయి. ఇక, ఇదే అదునుగా పలువురు దోపిడీకి తెరతీశారు. అనేక హోటల్స్, కేఫ్‌లు.. వినియోగదారుల నుంచి గ్యాస్ ఛార్జీలను అదనంగా వసూలు చేస్తున్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Aanusha

రచయిత గురించి

Aanusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.