📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Latest Telugu news : Central Election Commission : త్వరలో దేశవ్యాప్తంగా ‘సర్‌’

Author Icon By Sudha
Updated: October 10, 2025 • 5:12 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

దేశవ్యాప్తంగా ఓటరు జాబితా స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ ప్రక్రియను కేంద్ర ఎన్నికల కమిషన్‌ (Central Election Commission )దశలవారీగా ప్రారంభించే అవకాశం ఉన్నది. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న రాష్ట్రాల్లో సర్‌ ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉందని ఈసీ (Central Election Commission )అధికారులు తెలిపారు. స్థానిక ఎన్నికలు, ఎన్నికలు జరుగనున్న, జరుగుతున్న రాష్ట్రాల్లో స్పెషల్‌ డ్రైవ్‌ ఉండదని పేర్కొన్నారు. ఎన్నికల యంత్రాంగం స్థానిక సంస్థల ఎన్నికలతో బిజీగా ఉందని.. దాంతో సర్‌పై దృష్టి పెట్టలేమని ఈసీ చెబుతున్నది. వచ్చే ఏడాది అసోం, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. ఈ ఐదు రాష్ట్రాలతో పాటు తొలి దశలో పలు రాష్ట్రాల్లో స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ ప్రక్రియ ప్రారంభించే ఛాన్స్‌ ఉంది. ఇప్పటికే బిహార్‌లో సర్‌ ప్రక్రియ పూర్తయ్యింది. 7.472 కోట్ల పేర్లతో తుది జాబితాను సెప్టెంబర్‌ 30న ఈసీ ప్రచురించింది. అన్ని రాష్ట్రాల్లో ఓటర్ల జాబితాల సవరణను ప్రారంభించే పని జరుగుతోందని.. ప్రారంభంపై తుది నిర్ణయం ఎన్నికల కమిషన్ తీసుకుంటుందని ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ గత సోమవారం తెలిపారు.

Central Election Commission : త్వరలో దేశవ్యాప్తంగా ‘సర్‌’

ఈ నెల ప్రారంభంలో జరిగిన ఒక సమావేశంలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారులు (CEO) రాబోయే నుంచి 15 రోజుల్లో సర్‌ ప్రక్రియను ప్రారంభించడానికి సిద్ధంగా ఉండాలని చెప్పారు. ప్రక్రియ పూర్తయ్యాక రాష్ట్రాల వారీగా తుది ఓటర్ల జాబితాను ప్రచురించాలని ప్రధాన ఎన్నికల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఢిల్లీ ప్రధాన ఎన్నికల అధికారి వెబ్‌సైట్‌లో 2008 నుంచి ఓటర్ల జాబితాలున్నాయి. ఆ సమయంలోనే దేశ రాజధానిలో చివరిసారిగా సమగ్ర సవరణ జరిగింది. ఉత్తరాఖండ్‌లో చివరి సర్‌ 2006లో నిర్వహించగా.. ఆ సంవత్సరం ఓటర్ల జాబితా ఇప్పుడు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది. చాలా రాష్ట్రాల్లో ఓటర్ల జాబితాల చివరి సర్‌ ప్రక్రియ 2002 నుంచి 2004 మధ్య జరిగింది. అక్రమ వలసదారులను తొలగించడంతో పాటు ఓటరు జాబితాల సమగ్రతను కాపాడడమే సర్‌ ప్రాథమిక లక్ష్యమని ఈసీ పేర్కొంటున్నది.

భారత ఎన్నికల సంఘం విధులు?

భారత ఎన్నికల కమిషన్ ( ECI ) భారతదేశంలో స్వేచ్ఛగా మరియు నిష్పాక్షికంగా ఎన్నికలు నిర్వహించడానికి అధికారం కలిగిన రాజ్యాంగ సంస్థ . భారత రాజ్యాంగం ద్వారా స్థాపించబడిన దీనికి ప్రధాన ఎన్నికల కమిషనర్ నేతృత్వం వహిస్తారు మరియు ఇద్దరు ఇతర ఎన్నికల కమిషనర్లు రాజ్యాంగ సభ్యులుగా ఉంటారు . ఈ కమిషన్ ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది.

ఎన్నికల కమిషనర్ నియామకం మరియు పదవీకాలం?

ఎన్నికల కమిషనర్ నియామకం మరియు పదవీకాలం ప్రధాన ఎన్నికల కమిషనర్ మరియు ఇతర ఎన్నికల కమిషనర్ల (నియామకం, సేవా నిబంధనలు మరియు పదవీకాలం) చట్టం, 2023 లో నిర్దేశించబడింది . ఈ చట్టంలోని సెక్షన్ 7 ప్రకారం, భారత ప్రధానమంత్రి నేతృత్వంలోని మరియు లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు మరియు ప్రధానమంత్రి నామినేట్ చేసే కేంద్ర మంత్రి మండలి సభ్యునితో కూడిన ఎంపిక కమిటీ సిఫార్సుపై భారత రాష్ట్రపతి ఎన్నికల కమిషనర్‌ను నియమిస్తారు. ప్రధానమంత్రి సిఫార్సుపై వారిని గతంలో రాష్ట్రపతి నియమించారు. మార్చి 2023లో, భారత సుప్రీంకోర్టు ప్రధానమంత్రి, ప్రతిపక్ష నాయకుడు మరియు భారత ప్రధాన న్యాయమూర్తితో కూడిన కమిటీ నియామకాలు చేయాలని తీర్పునిచ్చింది మరియు దీనికి సంబంధించి కొత్త చట్టం రూపొందించే వరకు ఈ ప్రక్రియ అమలులో ఉంటుంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

Breaking News Central Election Commission election preparedness India Elections latest news nationwide survey Telugu News voter awareness

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.