📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె

Latest News: Social Media: సోషల్ మీడియా యాప్‌లకు కేంద్రం కొత్త నిబంధనలు

Author Icon By Aanusha
Updated: November 29, 2025 • 7:42 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారతదేశంలో మెసేజింగ్ యాప్‌ల వినియోగం (Social Media) పై కేంద్ర ప్రభుత్వం తాజాగా కీలక ఆదేశాలు జారీ చేసింది. డివైజ్‌లో సిమ్ కార్డు ఉంటేనే ఇలాంటి కమ్యూనికేషన్ యాప్ సర్వీసులు పనిచేసేలా చూడాలంటూ టెలికమ్యూనికేషన్స్ డిపార్టుమెంట్ సూచించింది. వాట్సాప్ , సిగ్నల్, స్నాప్ చాట్, టెలిగ్రామ్, షేర్ చాట్, జియో చాట్, అరట్టై, జోష్ వంటి కమ్యూనికేషన్ యాప్‌ (Social Media) లను కేంద్రం ఈ సూచనలు చేసింది. కేంద్రం కొత్తగా తీసుకువస్తున్న టెలికమ్యూనికేషన్‌ సైబర్‌ సెక్యూరిటీ సవరణ నిబంధనలు, 2025లో భాగంగా ఈ ఆదేశాలను డిపార్టుమెంట్ ఆఫ్ కమ్యూనికేషన్స్ విభాగం జారీ చేసింది.

Read Also: Nerella Jyothi: మాజీ మావోయిస్టు నాయకురాలు సర్పంచ్ పదవికి పోటీ

కొత్త నిబంధనల ప్రకారం ఈ యాప్‌లు తమ సేవలను వినియోగదారుడి సిమ్ కార్డ్‌తో నిరంతరం అనుసంధానమై ఉండేలా చూసుకోవాలి. అంతేకాకుండా కంప్యూటర్ బ్రౌజర్ల ద్వారా లాగిన్ అయిన వారిని ప్రతి 6 గంటలకు ఒకసారి ఆటోమేటిక్‌గా లాగౌట్ చేయాలని, మళ్లీ క్యూఆర్ కోడ్ ద్వారా ధ్రువీకరించుకున్న తర్వాతే లాగిన్ అవ్వనివ్వాలని టెలికాం శాఖ (డాట్) స్పష్టం చేసింది.

దీనివల్ల ప్రతీ సెషన్ యాక్టివ్‌గా ఉన్న సిమ్‌తో ముడిపడి ఉంటుందని, నేరగాళ్లు రిమోట్‌గా యాప్‌లను దుర్వినియోగం చేయడం కష్టమవుతుందని ప్రభుత్వం భావిస్తోంది.ప్రస్తుతం యాప్‌ను ఇన్‌స్టాల్ చేసే సమయంలో ఒక్కసారి మొబైల్ నంబర్‌ను ధ్రువీకరించుకుంటే చాలు.

Center’s new rules for social media apps

విదేశాల్లో ఉన్నవారు మోసాలకు పాల్పడుతున్నారు

ఆ తర్వాత సిమ్ కార్డ్‌ను తీసేసినా లేదా డీయాక్టివేట్ చేసినా యాప్ పనిచేస్తూనే ఉంటుంది. ఈ లొసుగును అడ్డం పెట్టుకుని సైబర్ నేరగాళ్లు, ముఖ్యంగా విదేశాల్లో ఉన్నవారు మోసాలకు పాల్పడుతున్నారని, వారిని గుర్తించడం కష్టంగా మారుతోందని ప్రభుత్వం చెబుతోంది. సిమ్ బైండింగ్ ద్వారా యూజర్,

వారి నంబర్, డివైజ్‌ మధ్య సంబంధాన్ని గుర్తించడం సులభమవుతుందని సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (COAI) అభిప్రాయపడినట్టు ‘మీడియానామా’ తన కథనంలో పేర్కొంది. ఇప్పటికే బ్యాంకింగ్, యూపీఐ యాప్‌లలో ఇలాంటి భద్రతా ప్రమాణాలు అమలులో ఉన్నాయి.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

latest news ShareChat India Signal app India Snapchat India Telegram India Telugu News WhatsApp India rules

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.