📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

Waqf Bill : వక్స్ ఆస్తులను కొట్టేసేందుకు కేంద్రం కుట్ర – ఒవైసీ

Author Icon By Sudheer
Updated: April 20, 2025 • 8:17 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

వక్ఫ్ ఆస్తులపై కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ సవరణ బిల్పై AIMIM అధినేత అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర స్థాయిలో స్పందించారు. హైదరాబాద్‌ దారుస్సలాంలో ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఈ బిల్లును ముస్లింల హక్కులపై యుద్ధంగా అభివర్ణిస్తూ, వక్ఫ్ బోర్డు ఆస్తులను కొట్టేసేందుకు ఇది కేంద్రం పన్నిన కుట్ర అని ఆరోపించారు.

ఒవైసీ హెచ్చరిక

ఈ బిల్లుతో ముస్లింల మతపరమైన, సామాజిక అవసరాల కోసం ఉన్న వక్ఫ్ ఆస్తులు ప్రభుత్వ కబంధ హస్తాల్లోకి వెళ్లే ప్రమాదం ఉందని ఒవైసీ హెచ్చరించారు. సమాధుల స్థలాల్లాంటి ప్రాథమిక అవసరాలకు కూడ భూమి మిగలదని, ముస్లిం సమాజం దారుణ పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. వక్ఫ్ బోర్డు అధికారాలను క్షీణింపజేసే విధంగా కేంద్రం వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు.

ఏప్రిల్ 30 నుంచి దేశవ్యాప్తంగా నిరసనలు

ఏప్రిల్ 30 నుంచి దేశవ్యాప్తంగా నిరసనలు చేపడతామని ఒవైసీ ప్రకటించారు. వక్ఫ్ బిల్లును వెనక్కి తీసుకునేంతవరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ముస్లింల ఆస్తుల పరిరక్షణకు, మతపరమైన హక్కుల సాధనకు ఇది అతి ముఖ్యమైన పోరాటమని, ప్రతి ఒక్కరు సంఘటితంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ బిల్లు ముస్లిం సమాజం హక్కులపై విరుద్ధంగా ఉన్నందున తక్షణమే ఉపసంహరించాల్సిందిగా కేంద్రాన్ని డిమాండ్ చేశారు.

Akbaruddin Owaisi Google News in Telugu Waqf Bill waqf bill muslims reaction

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.