📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..?

రైతులకు కేంద్రం శుభవార్త

Author Icon By Vanipushpa
Updated: January 23, 2025 • 12:02 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పంటలకు మద్దతు ధర విషయంలో రైతాంగానికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. గోగునార పంటకు కనీస మద్దతు ధరను క్వింటాలుకు రూ.305 మేర పెంచుతూ ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన నిన్న జరిగిన కేంద్ర క్యాబినెట్‌‌ నిర్ణయం తీసుకుంది. దీంతో 2025-26 సీజన్‌లో ముడి జనపనార (టీడీ-3) క్వింటాలకు ధరను రూ.5,650గా నిర్ణయించారు. ఇది సాగు ఖర్చుకంటే దాదాపు 67 శాతం అధికమని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. క్యాబినెట్ నిర్ణయాలను మీడియా వెల్లడించిన మంత్రి.. 2014-15లో ప్రధానిగా నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టే నాటికి జనపనార క్వింటాలు ధర రూ.2,400 ఉండేదని చెప్పారు. ప్రస్తుత ధర దాని కంటే 2.35 రెట్లు అధికమని ఆయన తెలిపారు.

సాగు వ్యయంపై అన్నదాతలకు సగటున 66.8 శాతం మేర ప్రయోజనం కలుగుతుందని పేర్కొన్నారు.
జనపనార పంటకు 2003-04- నుంచి 2013-14 మధ్య కాలంలో కనీస మద్దతు ధర కింద రూ.400 కోట్లు చెల్లిస్తే.. మోదీ వచ్చిన తర్వాత ఈ పదేళ్లలో రూ.1,300 కోట్ల అందజేసినట్టు తెలిపారు. దేశవ్యాప్తంగా జనపనార పరిశ్రమపై ప్రత్యక్షంగా.. పరోక్షంగా మొత్తం 40 లక్షల రైతు కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. గతేడాది 1.70 లక్షల మంది రైతుల నుంచి గోగునార కొనుగోలు చేశారు. ఒక్క పశ్చిమ్ బెంగాల్‌లోనే 82 శాతం మంది ఉండగా.. అసోం, బిహార్‌లో 9 శాతం మంది ఉన్నారు. ప్రస్తుతం అమల్లో ఉన్న జాతీయ ఆరోగ్య మిషన్‌ను మరో ఐదేళ్ల పాటు పొడిగించాలని క్యాబినెట్‌ తీర్మానించినట్టు పీయూష్ గోయల్ తెలిపారు. ఈ మిషన్ వల్ల దేశంలోని కోట్లాది మంది ప్రజలకు ప్రయోజనం కలిగిందని ఆయన అన్నారు. ఆరోగ్య రంగంలో సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను చేరుకోవడంలో పురోగతిని మంత్రివర్గం సమీక్షించింది.

Central Cabinet formers incresed money

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.