📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం

Jai shankar : విదేశాంగ మంత్రి జైశంకర్ భద్రతను పెంచిన కేంద్రం

Author Icon By Sudha
Updated: May 14, 2025 • 2:59 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత్-పాకిస్థాన్ సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జైశంకర్ (Jai shankar)భద్రతను కేంద్ర ప్రభుత్వం పెంచింది. నిఘా వర్గాల హెచ్చరికల మేరకు ఆయన కాన్వాయ్‌లో అదనంగా బుల్లెట్ ప్రూఫ్ (bulletproof)వాహనాన్ని చేర్చారు. జైశంకర్‌కి ప్రస్తుతం జెడ్ కేటగిరి భద్రత కొనసాగుతోంది. మరోవైపు, ఢిల్లీలోని పాకిస్థాన్ హై కమిషన్ అధికారిని దేశం విడిచి వెళ్లాలని భారత్ ఆదేశించింది. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ (Operation sindoor)కారణంగా ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తలెత్తాయి.

Jai shankar : విదేశాంగ మంత్రి జైశంకర్ భద్రతను పెంచిన కేంద్రం

భద్రత మరింత కట్టుదిట్టం
భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్న వేళ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశకంర్‌కి భద్రత పెంచినట్లు సమాచారం. అదనంగా మరొక బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని ఆయన కాన్వాయ్‌లో చేర్చినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఆయనకు ముప్ప ఉన్నట్లు నిఘా వర్గాల నుంచి సమాచారం అందడంతో.. కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
ప్రస్తుతం జైశంకర్‌కి జెడ్ కేటగిరి భద్రత ఉంది. సీఆర్‌పీఎఫ్ కమాండోలు ఆయనకు రక్షణ వలయంగా ఉంటారు. తాజా హెచ్చరికల నేపథ్యంలో ఆయన భద్రతను మరింత కట్టుదిట్టం చేస్తూ.. జైశంకర్ కాన్వాయ్‌లో మరో బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని చేరుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గతేడాది అక్టోబర్ తర్వాత జైశకంర్ భద్రతను వై నుంచి జెడ్ కేటగిరికి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. అలానే జైశకంర్ భద్రత బాధ్యతలు ఢిల్లీ పోలీస్ నుంచి సీఆర్‌పీఎఫ్‌కి బదిలీ చేశారు.
వీఐపీలకు సీఆర్‌పీఎఫ్ భద్రత
జెడ్ కేటగిరీ కింద 12 మందికి పైగా సాయుధ కమాండోలు ఆయనకు భద్రత కల్పిస్తున్నారు. ప్రస్తుతం అమిత్ షా, నితిన్ గడ్కరీ, దలైలామా, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాతో సహా దాదాపు 210 మంది వీఐపీలకు సీఆర్‌పీఎఫ్ భద్రత కల్పిస్తోంది.అయితే ప్రస్తుతం పాకిస్థాన్‌తో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో జైశంకర్‌కు ఈ భద్రతతో పాటు అదనంగా బుల్లెట్‌ ప్రూఫ్‌ కారును కూడా ఆయన కాన్వాయ్‌లో చేర్చినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అంతేకాక ఆయన నివాసం దగ్గర కూడా భద్రతను పెంచినట్లు తెలిసింది. పాక్‌తో ఉద్రిక్తతల నేపథ్యంలో మరోసారి ఆయన భద్రతను పెంచడం ఆసక్తికరంగా మారింది.
మరోవైపు ఢిల్లీలోని పాకిస్థాన్‌ హై కమిషన్ అధికారికి భారత ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. వెంటనే దేశం విడిచి వెళ్లిపోవాలని సూచించింది. సదరు అధికారి భారత సైన్యానికి సంబంధించిన కదలికలను లీక్‌ చేసినట్లు నిఘా వర్గాలు స్పష్టం చేయడంతో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అతడిని 24 గంటల్లో ఇండియా విడిచి వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేసింది.
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీగా భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టడంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. భారత్.. పాక్‌లోని ఉగ్ర స్థావరాలపై దాడులు చేసింది. ఆ దేశ ఎయిర్ బేస్‌లను ధ్వంసం చేసింది. బదులుగా పాక్ దాడులకు దిగగా.. ఇండియన్ ఆర్మీ వాటిని చాకచక్యంగా తిప్పికొట్టింది. ఆ తర్వాత ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరగడంతో ప్రస్తుతం పరిస్థితులు నెమ్మదిగా సాధారణ స్థితికి వస్తున్నాయి.

Read Also : Paradip Port: ఓడరేవులో 21 మంది పాకిస్థాన్‌ సిబ్బంది

Breaking News in Telugu Center increases External Affairs Minister Jaishankar Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News security of Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.