📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు

Central Cabinet: తిరుపతి – కాట్పాడి లైన్ డబ్లింగ్ కు కేంద్రం ఆమోదం

Author Icon By Vanipushpa
Updated: April 9, 2025 • 5:17 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కేంద్ర మంత్రివర్గ సమావేశం పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. మూడో సారి అధికారం లోకి వచ్చిన తరువాత మోదీ ప్రభుత్వం ఏపీకి సంబంధించి పలు ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ నిర్ణయాలు తీసుకుంటోంది. తాజాగా జరిగిన మంత్రివర్గ భేటీలో సుదీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉన్న తిరుపతి – కాట్పాడి లైన్ డబ్లింగ్ కు ఆమోదం తెలిపారు. ఈ నిర్ణయం ద్వారా తిరుపతి, శ్రీ కాళహస్తికి వచ్చే ప్రయాణీకులతో పాటుగా విద్య, వైద్య సంస్థలు ఎక్కువగా ఉండటంతో ఈ ప్రాంతానికి లబ్ది కలగనుంది.

రూ.1,332 కోట్లతో డబ్లింగ్‌ పనులకు ఆమోదం
కేంద్రం మంత్రివర్గ భేటీలో తిరుపతి నుంచి కాట్పాడి వరకు రూ.1,332 కోట్లతో డబ్లింగ్‌ పనులకు ఆమోదం లభించింది. ఇందుకు సంబంధించిన వివరాలను కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ వెల్లడించారు. ఈ ప్రాజెక్టు ద్వారా తిరుపతి, శ్రీకాళహస్తి, చంద్రగిరి కోట క్షేత్రాలకు లక్షల్లో భక్తులు తరలి వస్తారని చెప్పారు. తిరుపతి, వెల్లూరు ప్రాంతాలు వైద్య, విద్య హబ్‌లుగా ఉన్నా యని అన్నారు. దీనితో రాయలసీమ రీజియన్‌కు లబ్ధి చేకూరుతుందని పేర్కొన్నారు. అదే విధం గా ఎలక్ట్రానిక్స్‌, సిమెంట్‌, స్టీల్‌ తయారీ కంపెనీలకు కూడా లబ్ధి పొందుతాయని అశ్వినీ వైష్ణవ్ వివరించారు.
చిత్తూరు, తిరుపతి, వెల్లూరు జిల్లాకు లబ్ధి
తాజాగా ఆమోదం పొందిన ఈ ప్రాజెక్టు ద్వారా చిత్తూరు, తిరుపతి, వెల్లూరు జిల్లాకు లబ్ధి చేకూరు తుందని అశ్వినీ వైష్ణవ్ చెప్పుకొచ్చారు. ఈ ప్రాజెక్టులో 17 మేజర్‌, 327 మైనర్‌ వంతెనలు వస్తున్నాయని చెప్పారు. అదేవిధంగా 7 పైవంతెనలు, 30 అండర్‌ పాస్‌ బ్రిడ్జ్‌లు రానున్నట్లు తెలిపారు. 104 కి.మీ మార్గం రోడ్డుకు బదులు రైలు మార్గానికి రద్దీ మళ్లుతుందని వివరించారు. తద్వారా 20 కోట్ల కిలోల కార్బన్‌డయాక్సైడ్‌ తగ్గుతుందని తెలిపారు.

READ ALSO: New Aadhar App: కొత్త ఆధార్ యాప్ తెచ్చిన కేంద్రం

Center approves doubling irupati-Katpadi line

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.