📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Residential Certificate: బిహార్‌లో “క్యాట్ కుమార్” రెసిడెన్షియల్ సర్టిఫికేట్ దుమారం

Author Icon By Vanipushpa
Updated: August 11, 2025 • 4:03 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

రెసిడెన్షియల్ సర్టిఫికేట్(Residential Certificate) అంటే అది ఓ అడ్రస్ ఫ్రూఫ్.. అది ప్రభుత్వం అధికారికంగా మంజూరు చేస్తోంది. అలాంటి నివాస దృవీకరణ పత్రం కుక్కలకు, పిల్లులకు, విదేశాల్లో ఉన్న వ్యక్తులకు ఇవ్వడం అనేది ఆ రాష్ట్ర పరిపాలనా యంత్రాంగానికే మాయని మచ్చ లాంటిది. బిహార్‌ రాష్ట్రం(Bihar State)లో గవర్నమెంట్ ఆన్‌లైన్ సర్వీసులు అపహాస్యం చేసే ఘటనలు మరోసారి వెలుగుచూసింది. వారాల క్రితం ‘డాగ్ బాబు’ అనే కుక్క పేరుతో రెసిడెన్షియల్ సర్టిఫికేట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

https://twitter.com/thematrixloop/status/1954823702396252658?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1954823702396252658%7Ctwgr%5Eb1cbb5d5b0023531be5ba7a4923ab919fced5f6a%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Frtvlive.com%2Fviral%2Fresidential-certificate-application-has-been-received-in-bihar-under-the-name-kat-kumar-9648425

ట్రంప్ పేరు మీద రెసిడెన్షియల్ సర్టిఫికేట్

అది ఒక్కటి అంటే.. ఏదో పొరపాటున జరిగిందని అనుకోవచ్చు. తర్వాత అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేరు మీద రెసిడెన్షియల్ సర్టిఫికేట్ కోసం దరఖాస్తు అధికారుల దృ‌ష్టికి వచ్చింది. దాన్ని పరిశీలించిన అధికారులు అప్లికేషన్ రిజక్ట్ చేశారు. దరఖాస్తు వివరాల ప్రకారం.. “క్యాట్ కుమార్” తండ్రి పేరు “క్యాటీ బాస్”, తల్లి పేరు “కాటియా దేవి”గా నమోదు చేశారు. అప్లికేషన్‌లో క్యాట్ కుమార్ ఫోటో కూడా ఉంది. ఈ అప్లికేషన్ అఫీషియల్ పోర్టల్‌లో కనిపించడంతో అధికారులు షాక్ అయ్యారు.

బిహార్‌లో “క్యాట్ కుమార్” రెసిడెన్షియల్ సర్టిఫికేట్ దుమారం

బాధ్యులపై చర్యలు: జిల్లా కలెక్టర్

ఈ ఘటనపై రోహ్తాస్ జిల్లా కలెక్టర్ ఉదితా సింగ్ వెంటనే స్పందించారు. ఈ దరఖాస్తును పరిశీలించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని నస్రిగంజ్ రెవెన్యూ అధికారి కౌషల్ పటేల్‌ను ఆదేశించారు. “క్యాట్ కుమార్” రెసిడెన్షియల్ దరఖాస్తు చేసిన వ్యక్తులను గుర్తించేందుకు నస్రిగంజ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. రాష్ట్రంలో జరుగుతున్న ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా నివాస ధ్రువపత్రాల కోసం అప్లికేషన్లు ఎక్కువగా వస్తున్నాయి. అయితే, ఈ ప్రక్రియను దుర్వినియోగం చేస్తూ కొందరు వ్యక్తులు ఇలాంటి హాస్యస్పదమైన అప్లికేషన్లు పెడుతున్నారని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి చర్యలు ప్రభుత్వ పనులకు ఆటంకం కలిగిస్తున్నాయని, ఇవి చట్టరీత్యా నేరమని అధికారులు హెచ్చరిస్తున్నారు.

ఒక ఉద్యోగి సస్పెండ్

గతంలో పట్నాలోని మసౌర్హి బ్లాక్‌లో ‘డాగ్ బాబు’ పేరుతో ఒక కుక్కకు నివాస ధ్రువపత్రం జారీ అయింది. ఈ ఘటనపై విచారణ జరిపి, నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఒక ఉద్యోగిని సస్పెండ్ చేశారు.
తాజాగా, ఈ ‘క్యాట్ కుమార్’ ఘటన మరోసారి అధికారులకు, ప్రజలకు ఆశ్చర్యం కలిగించింది. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అధికారులు ఈ దరఖాస్తు వెనుక ఉన్న అల్లరి మూకలను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.

బిహార్‌లో రెసిడెన్షియల్ సర్టిఫికెట్

(నివాస ధ్రువీకరణ పత్రం) కోసం వికీపీడియాలో సమాచారం లేదు. అయితే, రెసిడెన్షియల్ సర్టిఫికెట్ అనేది ఒక వ్యక్తి నిర్దిష్ట ప్రదేశంలో నివసిస్తున్నాడని ధృవీకరించే ఒక ముఖ్యమైన పత్రం. ఇది సాధారణంగా వివిధ ప్రభుత్వ పథకాలు, సేవలు మరియు ఇతర ప్రయోజనాల కోసం దరఖాస్తు చేసేటప్పుడు అవసరమవుతుంది. మీరు మీ రెసిడెన్షియల్ సర్టిఫికెట్ కోసం బిహార్ ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్‌ను లేదా సంబంధిత ప్రభుత్వ కార్యాలయాన్ని సంప్రదించవచ్చు.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/supreme-court-street-dogs-removal-order/national/528897/

Bihar Cat Kumar Controversy India News Latest News Breaking News Politics Residential Certificate Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.