దేశంలో అత్యంత కఠినమైన ప్రవేశపరీక్షలో కామన్ అడ్మిషన్ టెస్ట్ ఒకటి. ఈ పరీక్షను ఈ ఏడాదికి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ కోజికోడ్ నిర్వహించనుంది. క్యాట్ పరీక్షను నవంబరు 30వ తేదీన ఆన్ లైన్(online) విధానంలో దేశవ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో నిర్వహించనున్నారు. ఈ పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డులను తాజాగా విడుదల చేసింది. క్యాట్ పరీక్షకుదరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ ఆప్లికేషన్ లాగిన్ ఐడీ, పాస్ వర్డ్ వివరాలు అధికారిక వెబ్ సైట్ లలో(Web site) నమోదు చేసి అడ్మిట్ కార్డ్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
Read Also: Delhi blast : ఈ నెల 10న ఢిల్లీ వైపు కారును తీసుకెళ్లిన ఉమర్ నబీ
కొన్ని పొరపాట్లు వల్లే విఫలమవుతున్న విద్యార్థులు
యేటా ఈ కఠిన పరీక్ష రాసే అభ్యర్థులు ఇందులో విజయం సాధించడంలో విఫలమవుతూ ఉంటారు. పరిజ్ఞానం లేకకాదు. ఈ పరీక్ష రోజున చేయకూడని కొన్ని ఎపొరపాట్లు చేయడం వల్లే ఎందరో విఫలమవుతుంటారు.
ముఖ్యంగా క్యాట్ 2025(Cat 2025) పరీక్ష వెళ్లేముందు అడ్మిట్ కార్డులో(Admit card) పేరు, ఫొటో, రిజిస్ట్రేషన్ నంబర్, పరీక్ష తేదీ, సమయం, పరీక్షా కేంద్రం(Examination Center) వంటి వివరాలు క్షుణ్ణంగా పరిశీలించుకోవాలి. ఇందులో చిన్నపాటి లోపం వచ్చినా ఇబ్బందులు తప్పవు. అలాగే పరీక్ష రోజున టెస్ట్ సెంటర్ కు కాస్త త్వరగా చేరుకోవాలి. అభ్యర్థులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఫోన్లు, కాలిక్యులేటర్, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను చెంత తీసుకెళ్లకూడదు. స్క్రీన్ పై కనిపించే అన్ని సూచనలను చదవడానికి కొంత సమయం కేటాయించాలి. ముఖ్యంగా మార్కింగ్ స్కీమ్ (నెగెటివ్ మార్కింగ్), నావిగేషన్ సిస్టమ్ పూర్తిగా అర్థం చేసుకోండి.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: