📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్ ట్రంప్ హెచ్చరికలతో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి చైనా టార్గెట్ గా వెనుజులాపై అమెరికా దాడి న్యూ ఇయర్ దాడి కుట్ర అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్ ట్రంప్ హెచ్చరికలతో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి చైనా టార్గెట్ గా వెనుజులాపై అమెరికా దాడి న్యూ ఇయర్ దాడి కుట్ర

Beggar cash recovery : చనిపోయిన భిక్షగాడి వద్ద లక్షల నగదు , కేరళలో షాకింగ్ ఘటన

Author Icon By Sai Kiran
Updated: January 8, 2026 • 9:14 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Beggar cash recovery : ఓ సాధారణ భిక్షగాడి దగ్గర లక్షల కొద్దీ నగదు బయటపడటం కేరళలో సంచలనం రేపింది. అలప్పుళ జిల్లా చారుమ్మూడులో భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్న వ్యక్తి మృతి చెందిన తర్వాత అతడి వద్ద ఏకంగా రూ.4.5 లక్షలకు పైగా నగదు, విదేశీ కరెన్సీ లభ్యమైంది. ఈ ఘటన స్థానికులను, పోలీసులను కూడా ఆశ్చర్యానికి గురిచేసింది.

జనవరి 5 సోమవారం రాత్రి చారుమ్మూడు సెంటర్‌లో స్కూటర్ ఢీకొనడంతో అనిల్ కిశోర్ అనే యాచకుడు తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు వెంటనే అతడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ తన పేరు అనిల్ కిశోర్, స్వస్థలం కాయంకుళం అని తెలిపిన అతడు, మెరుగైన చికిత్స అవసరమన్న వైద్యుల సూచనలను పట్టించుకోకుండా ఆసుపత్రి నుంచి వెళ్లిపోయాడు. మరుసటి రోజు ఉదయం ఓ దుకాణం వరండాలో అతడు మృతదేహంగా కనిపించాడు.

పోలీసుల తనిఖీలో షాకింగ్ విషయాలు

మృతదేహం వద్ద ఉన్న పాత సంచులు, ప్లాస్టిక్ డబ్బాలను పోలీసులు నూరనాడ్ పోలీస్ స్టేషన్‌కు తరలించి తనిఖీ చేశారు. అందులో నోట్ల కట్టలు (Beggar cash recovery) కనిపించడంతో పోలీసులు అవాక్కయ్యారు. స్థానిక పంచాయతీ సభ్యుడి సమక్షంలో లెక్కించగా మొత్తం రూ.4,52,207 నగదు ఉన్నట్లు తేలింది. ఇందులో ప్రభుత్వం రద్దు చేసిన రూ.2000 నోట్లు 12 ఉన్నాయి. అంతేకాకుండా సౌదీ రియాల్స్ వంటి విదేశీ కరెన్సీ కూడా లభ్యమైంది.

Read also: AP: పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్

ఈ డబ్బునంతటినీ ప్లాస్టిక్ డబ్బాల్లో పెట్టి, సెల్లో టేపులతో బిగించి భద్రపరచుకున్నట్లు పోలీసులు గుర్తించారు. రోడ్డు ప్రమాదంలో గాయపడినప్పటికీ ఆసుపత్రి నుంచి ఎందుకు వెళ్లిపోయాడనే కోణంలో విచారణ చేపట్టగా, తన వద్ద ఉన్న డబ్బు ఎవరైనా దోచుకుంటారనే భయంతోనే చికిత్సను తిరస్కరించి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. గాయాల ప్రభావంతోనే అతడు మృతి చెందినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రస్తుతం ఈ నగదును పోలీసులు స్వాధీనం చేసుకుని కోర్టుకు అప్పగించారు. మృతుడికి సంబంధించిన బంధువుల వివరాలపై దర్యాప్తు కొనసాగుతోంది.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

Alappuzha accident beggar cash recovery Breaking News in Telugu dead beggar money foreign currency found Google News in Telugu Kerala News Latest News in Telugu police investigation road accident Kerala shocking news India Telugu News viral news India

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.