📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్

Vijay Rupani: కారు లక్కీ నంబర్ 1206 .. జూన్ 12 విజయ్ రూపానీ దుర్మరణం

Author Icon By Sudha
Updated: June 13, 2025 • 3:29 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ ప్రాణాలు కోల్పోయారు. 1206 అనే సంఖ్యను అదృష్ట నంబర్‌ (Lucky Number)గా భావించిన విజయ్ రూపానీ (Vijay Rupani), అదే సంఖ్య వచ్చే రోజున, జూన్ 12న జరిగిన ఈ దుర్ఘటనతో చనిపోయారు. ఆయన ఆకస్మిక మృతితో కుటుంబ సభ్యులు, అనుచరులు, అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు.

Vijay Rupani: కారు లక్కీ నంబర్ 1206 .. జూన్ 12 విజయ్ రూపానీ దుర్మరణం

లక్కీ నెంబర్
విజ‌య్ రూపానికి సంబంధించిన అన్ని వాహ‌నాల నంబ‌ర్ కూడా 12/06 అని ఉంటుంది. కానీ అదే నంబర్ వచ్చే రోజున ఆయన చనిపోయారు. నిన్న జూన్ 12. అంటే.. 1206 వస్తుంది. దీంతో మాజీ సీఎం అదృష్ట సంఖ్య.. దుర‌దృష్టంగా మారిందంటూ నెటిజ‌న్లు కామెంట్లు పెడుతున్నారు.
అహ్మదాబాద్‌లో ప్రమాదానికి గురైన విమానంలో గుజరాత్‌ మాజీ ముఖ్యమంత్రి విజయ్‌ రూపానీ ఉన్నారన్న వార్త ఆయన కుటుంబ సభ్యులను కలిచివేస్తోంది. ఆగస్ట్‌ 22 , 1956లో అప్పటి బర్మా రాజధాని రంగూన్‌లో జన్మించారు విజయ్‌ రూపానీ. అయితే బర్మాలో రాజకీయ సంక్షోభం కారణంగా ఆయన కుటుంబం 1960లో భారత్‌కు వలస వచ్చింది. గుజరాత్‌ లోని రాజ్‌కోట్‌లో స్థిరపడింది. ఎమర్జెన్సీ సమయంలో 11 నెలల పాటు జైల్లో ఉన్నారు. 1987లో రాజ్‌కోట్‌లో కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు. 1996-1997 మధ్య రాజ్‌కోట్‌ మేయర్‌గా పనిచేశారు. 2006 నుంచి 2012 వరకు రాజ్యసభ ఎంపీగా ఉన్నారు.
మోర్చాలో కీలక నేత
2014లో తొలిసారి రాజ్‌కోట్‌ నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆయన ఆనందీబెన్‌ పటేల్‌ కేబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. రవాణాశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 2016లో గుజరాత్‌ బీజేపీ అధ్యక్ష పదవిని చేపట్టారు. 2016లో సీఎం పగ్గాలు చేపట్టారు విజయ్‌ రూపానీ. 2021 వరకు ఆయన సీఎం పదవిలో ఉన్నారు. 2021లో సీఎం పదవికి రాజీనామా చేశారు. ఆయన స్థానంలో భూపేంద్ర పటేల్‌ సీఎం పదవిని చేపట్టారు. ఆయన సతీమణి అంజలి కూడా బీజేపీ మహిళా మోర్చాలో కీలక నేతగా ఉన్నారు.
విజయ్‌ రూపానీ మృతిని గుజరాత్ ప్రభుత్వం ధృవీకరించింది. లండన్‌లో ఉన్న కూతురు , భార్యను కలిసేందుకు ఆయన లండన్‌ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు అధికారులు వెల్లడించారు. విమాన ప్రమాదంలో గతంలో ఏపీ సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి చనిపోయారు. అరుణాచల్‌ సీఎం ఖందూ కూడా విమాన ప్రమాదంలోనే కన్నుమూశారు. గుజరాత్‌ మాజీ సీఎం బల్వంత్‌రాయ్‌ మెహతా కూడా 1965లో విమాన ప్రమాదం లోనే చనిపోయారు.

Read Also:Flight Crash: ఆనంద కుటుంబం కాస్త అగ్నికి ఆహుతి

#telugu News Breaking News in Telugu Car lucky number 1206.. Google news Google News in Telugu June 12 Vijay Rupani's death Latest News in Telugu Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.