📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Cancer Patients: జిల్లా ఆసుపత్రుల్లోనే కీమోథెరపీ సేవలు

Author Icon By Saritha
Updated: February 14, 2026 • 5:25 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

క్యాన్సర్ రోగులకు (Cancer Patients) కేంద్ర ప్రభుత్వం (Central Government) భారీ ఊరట కల్పించింది. దేశవ్యాప్తంగా జిల్లా ఆసుపత్రుల్లో డే కేర్ క్యాన్సర్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. రాబోయే మూడేళ్లలో ఈ కేంద్రాలను నెలకొల్పనుండగా, 2025-26 ఆర్థిక సంవత్సరంలోనే 200 కేంద్రాలను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ నిర్ణయంతో కీమోథెరపీ వంటి కీలక చికిత్సలు రోగుల నివాస ప్రాంతాలకు దగ్గరగా అందుబాటులోకి రానున్నాయి.

Read Also: Brahmaputra: రోడ్డు-రైలు హైబ్రిడ్ అండర్‌వాటర్ టన్నెల్ కు క్యాబినెట్

ఆమోదం

Chemotherapy services in district hospitals

క్యాన్సర్ చికిత్స కోసం రోగులు (Cancer Patients) తరచుగా నగర ఆసుపత్రులకు వెళ్లాల్సి రావడం గ్రామీణ, ఆర్థికంగా వెనుకబడిన ప్రజలకు భారంగా మారుతోంది. ప్రయాణం, బస, ఆహారం, వేతనం కోల్పోవడం వంటి ఖర్చులు కుటుంబాలపై ప్రభావం చూపుతున్నాయి. ఈ ఇబ్బందులను దూరం చేసేందుకే ప్రభుత్వం జిల్లాస్థాయిలో ఈ డే కేర్ కేంద్రాలను ప్రారంభిస్తోంది.

ఈ కేంద్రాల ఏర్పాటుకు ముందు ప్రభుత్వం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో కలిసి లోటుపాట్లపై అధ్యయనం చేసింది. క్యాన్సర్ కేసుల సంఖ్య, రోగుల భారం, మౌలిక సదుపాయాల లభ్యత ఆధారంగా జిల్లాలను ఎంపిక చేశారు. ఎంపికైన జిల్లాల్లోని వైద్యులు, నర్సులకు ప్రభుత్వ వైద్య కళాశాలలు, ప్రాంతీయ క్యాన్సర్ కేంద్రాల్లో 4 నుంచి 6 వారాల పాటు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. కీమోథెరపీ మందుల మోతాదు, దుష్ప్రభావాల నిర్వహణ, అత్యవసర పరిస్థితుల ఎదుర్కోవడం, మందుల భద్రత వంటి అంశాల్లో వారికి శిక్షణనిచ్చారు. కీమోథెరపీ మందులను ఉచితంగా అందించనున్నారు. క్యాన్సర్ చికిత్సలో మందుల ఖర్చు అధికంగా ఉండే నేపథ్యంలో ఈ నిర్ణయం రోగులపై ఆర్థిక భారాన్ని గణనీయంగా తగ్గిస్తుంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

cancer treatment Central Government Chemotherapy District Hospitals HealthCare Latest News in Telugu medical services suspended Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.