📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Brahmaputra: రోడ్డు-రైలు హైబ్రిడ్ అండర్‌వాటర్ టన్నెల్ కు క్యాబినెట్ ఆమోదం

Author Icon By Vanipushpa
Updated: February 14, 2026 • 3:17 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోనే మొట్టమొదటి రోడ్డు-రైలు హైబ్రిడ్ అండర్‌వాటర్ టన్నెల్ నిర్మిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. రూ. 18, 600 కోట్లతో వస్తున్న ఈ ప్రాజెక్టును కేంద్ర క్యాబినెట్ అప్రూవ్ చేసింది. అస్సాంలోని బ్రహ్మపుత్ర(Brahmaputra) నది అడుగున ఆధునిక రవాణా సదుపాయాలు ఏర్పాటు చేయాలనే ప్రతిష్ఠాత్మక ప్రణాళికకు ఈ ప్రాజెక్టుతో బీజం పడింది. నది కిందుగా రోడ్డు-రైలు మార్గాలను కలిపే దేశపు తొలి అండర్‌వాటర్ సొరంగం నిర్మించేందుకు అనుమతి లభించింది. ఈ ప్రాజెక్ట్‌ను అత్యాధునిక ట్విన్ ట్యూబ్ టన్నెల్ బోరింగ్ మెషిన్ (TBM) సాంకేతికతతో నిర్మించనున్నారు. ఇందులో ఒక ట్యూబ్ పూర్తిగా రైల్వే రవాణాకు, మరో ట్యూబ్ రహదారి ప్రయాణానికి కేటాయించనున్నారు. ఈ సొరంగం మొత్తం పొడవు సుమారు 33.7 కిలోమీటర్లుగా ఉండనుంది. అస్సాంలో రవాణా కనెక్టివిటీని పూర్తిగా మార్చే సామర్థ్యం ఈ ప్రాజెక్ట్‌కు ఉందని కేంద్రం భావిస్తోంది.

Read Also: Congress: పాకిస్థాన్‌ను పొగిడిన శశిథరూర్..అసలేం జరిగిందంటే?

Brahmaputra: రోడ్డు-రైలు హైబ్రిడ్ అండర్‌వాటర్ టన్నెల్ కు క్యాబినెట్ ఆమోదం

ట్విన్-ట్యూబ్ రోడ్డు-రైలు టన్నెల్‌కు రూ.18,662 కోట్లకు పైగా నిధులు

ముఖ్యంగా నది కారణంగా ఎదురయ్యే ప్రయాణ ఆలస్యం, వాతావరణ ప్రభావాల సమస్యలను ఈ సొరంగం ద్వారా గణనీయంగా తగ్గించవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అస్సాంలో బ్రహ్మపుత్ర నది కిందుగా దేశంలోనే తొలిసారిగా నిర్మించబోయే అండర్‌వాటర్ ట్విన్-ట్యూబ్ రోడ్డు-రైలు టన్నెల్‌కు రూ.18,662 కోట్లకు పైగా నిధులను కేటాయిస్తూ కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది.ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ ఆర్థిక వ్యవహారాల కమిటీ సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. అస్సాం అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఈ ప్రాజెక్ట్‌కు ఆమోదం లభించడం రాజకీయంగా.. అభివృద్ధి పరంగా కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ ప్రాజెక్ట్ ప్రత్యేకత ఏమిటంటే.. ఇది టెక్నాలజీ పరంగా భారత్‌లోనే ఒక మైలురాయిగా నిలవనుంది. ట్విన్-ట్యూబ్ టన్నెల్ బోరింగ్ మెషిన్ (TBM) సాంకేతికతతో ఈ సొరంగం నిర్మించబడుతుంది. ఇందులో ఒక ట్యూబ్ రోడ్డు వాహనాల రాకపోకలకు, మరో ట్యూబ్ రైల్వే రవాణాకు ఉపయోగపడుతుంది. మొత్తం ప్రాజెక్ట్ పొడవు సుమారు 33.7 కిలోమీటర్లు కాగా, అందులో 15.79 కిలోమీటర్లు నేరుగా బ్రహ్మపుత్ర నది అడుగున నిర్మించే అండర్‌వాటర్ టన్నెల్ భాగం. మిగిలిన భాగం ఆధునిక కట్ అండ్ కవర్ పద్ధతిలో నిర్మించనున్నారు.

ఉత్తర పూర్వ భారత ప్రాంత అభివృద్ధికి పెద్ద ఊతం

ఈ మహత్తర సొరంగం అస్సాంలోని గోహ్‌పూర్ ప్రాంతాన్ని నూమాలిగఢ్‌తో నేరుగా అనుసంధానం చేస్తుంది. ప్రస్తుతం ఈ రెండు ప్రాంతాల మధ్య ప్రయాణించాలంటే సుమారు 240 కిలోమీటర్లు తిరిగి వెళ్లాల్సి వస్తోంది, దీనికి ఆరు గంటల వరకు సమయం పడుతుంది. అయితే ఈ టన్నెల్ పూర్తయిన తర్వాత అదే ప్రయాణం కేవలం 20 నుంచి 30 నిమిషాల్లో పూర్తవుతుందని అంచనా వేస్తున్నారు. ప్రయాణ దూరం కూడా కేవలం 34 కిలోమీటర్లకు తగ్గనుంది. ఇది ప్రజలకు మాత్రమే కాకుండా వ్యాపారాలు, సరుకు రవాణాకు కూడా గణనీయమైన లాభాన్ని ఇస్తుంది. ఆర్థికంగా చూస్తే.. ఈ ప్రాజెక్ట్ ఉత్తర పూర్వ భారత ప్రాంత అభివృద్ధికి పెద్ద ఊతం ఇవ్వనుంది. కనెక్టివిటీ మెరుగుపడటంతో పరిశ్రమలు, వాణిజ్యం, లాజిస్టిక్స్ రంగాలు వేగంగా విస్తరిస్తాయని నిపుణులు చెబుతున్నారు. వ్యవసాయ ఉత్పత్తులు, పారిశ్రామిక సరుకులు తక్కువ సమయంలో మార్కెట్లకు చేరుకోవడం వల్ల ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థ మరింత బలపడుతుంది. భద్రతా పరంగా కూడా ఈ టన్నెల్‌కు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

cabinet approval Infrastructure development India mega infrastructure project Road rail hybrid tunnel Telugu News Paper Telugu News Today Transport Ministry Underwater tunnel project

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.