📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..?

Budget2026: 4 రాష్ట్రాల్లో రేర్ ఎర్త్ మినరల్స్ పథకం

Author Icon By Pooja
Updated: February 3, 2026 • 3:29 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్‌ను(Budget2026) తొమ్మిదోసారి ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌లో దేశ ఆర్థిక అభివృద్ధికి దోహదపడే పలు కీలక నిర్ణయాలను ఆమె ప్రకటించారు.

Read Also:Budget 2026: ఆపిల్‌కు భారీ పన్ను ఊరట!

రేర్ ఎర్త్ మినరల్స్ కోసం ప్రత్యేక మిషన్

ఖనిజ వనరులు సమృద్ధిగా ఉన్న రాష్ట్రాలకు ప్రోత్సాహం అందించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కొత్త చర్యలు చేపట్టనుంది. రేర్ ఎర్త్ మినరల్స్ అభివృద్ధి కోసం నాలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక కార్యక్రమం ప్రారంభించనున్నట్లు మంత్రి(Budget2026) వెల్లడించారు. ఇందులో ఆంధ్రప్రదేశ్‌తో పాటు కేరళ, ఒడిశా, తమిళనాడు రాష్ట్రాల్లో ప్రత్యేక మైనింగ్ మిషన్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. తీర ప్రాంత రాష్ట్రాల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని ప్రపంచస్థాయి కంటెయినర్ ఉత్పత్తి కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయనున్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఇది ఎగుమతులు, ఉపాధి అవకాశాలు పెంచే దిశగా కీలకంగా నిలవనుందని పేర్కొన్నారు.

విద్య, ఫార్మా, పరిశోధన రంగాలకు బలం

దేశవ్యాప్తంగా ఫార్మా, విద్య, పరిశోధన రంగాల్లో అభివృద్ధి కోసం మూడు కొత్త జాతీయ స్థాయి విద్యా సంస్థలను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు. అలాగే ఛాంపియన్ ఎంఎస్ఎంఈల కోసం ప్రత్యేక కార్యాచరణను రూపొందించినట్లు వెల్లడించారు. సెమీకండక్టర్ ఇండియా మిషన్ 2.0 కోసం రూ.40 వేల కోట్లు కేటాయిస్తున్నట్లు కేంద్ర మంత్రి ప్రకటించారు. అదనంగా దేశంలో మూడు కొత్త రసాయన పార్కుల స్థాపనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మౌలిక సదుపాయాల అభివృద్ధికి మొత్తం రూ.12.2 లక్షల కోట్ల నిధులు కేటాయించినట్లు తెలిపారు.

జౌళీ రంగానికి ప్రాధాన్యం

జౌళీ రంగ విస్తరణ, ఆధునీకరణ, ఉపాధి అవకాశాల పెంపు దిశగా మరిన్ని చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి చెప్పారు. అంతర్జాతీయ మార్కెట్లలో భారత జౌళీ ఉత్పత్తులకు బ్రాండింగ్ కల్పించేందుకు ప్రత్యేక కార్యాచరణ, మెగా టెక్స్‌టైల్స్ పార్కులు, పరిశ్రమలకు విద్యా సంస్థల అనుసంధానం వంటి అంశాలను బడ్జెట్‌లో పొందుపరిచినట్లు వివరించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epapervaartha.com

Read Also:

Google News in Telugu Latest News in Telugu NirmalaSitharaman rareearthminerals

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.